ఉదయం లేవగానే ఆ ఫీల్ కలుగుతోందా..? డేంజర్లో పడ్డట్టే!

by Javid Pasha |   (  Updated:2025-12-13 08:06:03  IST  )

ఉదయం లేవగానే వాంతులు, వికారం జలి జ్వరం వచ్చి కాసేపటికే తగ్గడం వంటివి మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే సంకేతాలు కావచ్చు.

ఉదయం లేవగానే ఆ ఫీల్ కలుగుతోందా..? డేంజర్లో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్ : ఉదయం నిద్రలవేగానే ఆందోళనగా అనిపిస్తోందా? అనీజీగా ఫీలవుతున్నారా? అలసటతో ఇబ్బంది పడుతున్నారా? నడుము నొప్పి వేధిస్తోందా? ఎప్పుడో ఒకప్పుడైతే అది నార్మల్. కానీ తరచుగా అదే ఫీల్ అనుభవిస్తుంటే మాత్రం మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ లక్షణాలతోపాటు పక్కటెముకల కింది భాగాన, పొత్తి కడుపులో వన్‌సైడ్ మాత్రమే పదే పదే నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కిడ్నీల పనితీరు

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి శరీరంలోని చెడు రక్తాన్ని వడబోసి, అందులోని వ్యవర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే మూత్ర పిండాల పనితీరు ఏమాత్రం మందగించినా అనారోగ్యాలు దాడిచేస్తుంటాయి. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు.

మార్నింగ్ సింప్టమ్స్

*తీవ్రమైన నొప్పి : ఉదయంపూట పక్కటెముకలు లేదా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి మొదలై అది గజ్జలు లేదా తొడలకు వ్యాపిస్తుంది. అట్లనే మధ్య మధ్యలో పెయిన్ అధికమవుతూ, కొంత సమయం తగ్గుతూ మళ్లీ రావచ్చు.

*యూరిన్‌లో మార్పులు : మూత్రంలో రక్తం (హెమటూరియా) పడటం, రంగు మారడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయనడానికి సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. అలాగే యూరిన్ కలర్ పింక్, రెడ్ లేదా లైట్ బ్రౌన్ కలర్‌లో కనిపించవచ్చు. దీంతోపాటు దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లేదా చాలా తక్కువ పరిమాణంలో యూరిన్ బయటకు రావడం కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని తెలిపే సంకేతాలే అంటున్నారు హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్

*వాంతులు, వికారం : ఉదయం లేవగానే వాంతులు, వికారం వంటివి రావడం, జలి జ్వరం వచ్చి కాసేపటికే తగ్గడం, మళ్లీ రావడం వంటి లక్షణాలు కూడా కిడ్నీల పనితీరు మందగించిందని లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియజేసే ప్రధాన సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాళ్లు, చీలమండల భాగాలు, ముఖం లేదా చేతులలో తరచుగా వాపు రావడం కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సంభవిస్తుంది.

*ఏం చేయాలి : కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటం లేదా వాటి పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. రోజువారి జీవితంలో తగిన జాగ్రత్తలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తప్పక తాగాలి. దీంతో కడ్నీల్లో ఉండే చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, ప్యూరిన్ (మాంసం, చేపలు) ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినాలి. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story