- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : ఏఐ బ్రెయిన్ ఫ్రై.. అధిక వినియోగం వల్ల వస్తున్న కొత్త సమస్య!
ఏఐ టూల్స్‌పై అధిక వాడకం‘బ్రెయిన్ ఫ్రై’ అనే మానసిక స్థితికి దారితీస్తున్నదని పరిశోధకులు గుర్తించారు

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో ప్రపంచమే మారిపోయింది. వివిధ రంగాల్లో ఏఐ టూల్స్ వినియోగం మెరుగైన ఉత్పాదకతకు సహాయపడుతోంది. అయితే వాటిని అధికంగా ఉపయోగించడం మానసిక సామర్థ్యానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తున్నదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగా 1,500 మందిని ప్రశ్నించగా 14% మంది ఏఐ ఉపయోగంవల్ల కాగ్నెటివ్ అలసటను అనుభవిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మల్టిపుల్ ఏఐ వ్యవస్థలతో తీవ్రమైన పరస్పర చర్యలు ‘ఏఐ బ్రెయిన్ ఫ్రై (AI brain fry)’ అనే స్థితికి దారితీస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
రోజువారీ జీవితంలో ఏఐ టూల్స్‌పై అధికంగా ఆధారపడేవారు. తరచుగా వాటిని ఉపయోగించేవారు మెంటల్ ఫెటీగ్ (mental fatigue), మెంటల్ ఫాగ్, తలనొప్పి, నిర్ణయాలలో గందరగోళం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది సాంప్రదాయిక బర్న్ అవుట్‌కు భిన్నంగా ఏఐ- రిలేటెడ్ మెంటల్ స్ట్రెస్ వల్ల మాత్రమే ఏర్పడుతున్నదని కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంటిగ్రేటింగ్(Integrating) పెరుగుతున్న కొద్దీ, మానవ ఆలోచన, ఏఐ సహాయం మధ్య సరైన సమతుల్యత అవసరమనే విషయాన్ని ‘ఏఐ బ్రెయిన్ ఫ్రై’ గుర్తు చేస్తున్నదని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి టెక్నాలజీని అవసరం కోసం వాడుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని, అవసరానికి మించి అధికంగా ఆధారపడటం కూడా సమస్యలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.






