ఇన్ఫినిట్ స్క్రోల్ ఫెటీగ్.. అన్‌‌లిమిటెడ్ సోషల్ మీడియా స్క్రోలింగ్‌తో అవస్థలు!

by Javid Pasha |

సోషల్ మీడియా యాప్‌ల అధిక వినియోగం, స్ర్కోలింగ్ వల్ల వచ్చే అలసట నుంచి బయటపడేందుకు గంటల తరబడి సమయాన్ని కేటాయించడం మానుకోవాలి అంటున్నారు నిపుణులు.

ఇన్ఫినిట్ స్క్రోల్ ఫెటీగ్.. అన్‌‌లిమిటెడ్ సోషల్ మీడియా స్క్రోలింగ్‌తో అవస్థలు!
X

దిశ, ఫీచర్స్ : ఇన్ఫినిట్ స్క్రోల్ ఫెటీగ్(Infinite Scroll Fatigue), డిజిటల్ డిటాక్స్ వంటి విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. మఖ్యంగా జెన్‌జీల(Generation Z)ను ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికత అవసరమే అయినప్పటికీ, ఇన్‌స్టా‌గ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్(ట్విట్టర్), రెడ్డిట్, టిక్‌టాక్ వంటి పలు సోషల్ మీడియా యాప్‌ల అతివినియోగం యువతలో మానసిక అలసటకు దారితీస్తున్నదని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఎందుకని వాటిలో మునిగిపోతున్నారంటే.. యూజర్లను ఆకర్షించడానికి రూపొందించబడిన డిజైన్ల వల్ల, కంటెంట్ ట్రిక్స్ వల్ల ఇది వస్తుంది. అంతులేని స్క్రోలింగ్ చేస్తూ గంటల తరబడి గడపడం మానసిక & శారీరక అలసట, చిరాకు, ఎంప్టీ ‌ఫీలింగ్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు.

*సోషల్ మీడియా యాప్‌లు మొదట సామాజిక సంబంధాల కోసం ఉద్దేశించి క్రియేట్ చేయబడినప్పటికీ, ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లుగా మారి, రియల్-టైమ్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు, ప్రాంప్ట్‌లతో యూజర్‌లను ఆకట్టుకుంటున్నాయి. అయితే యూజర్లలె చివరికి ఏమీ గుర్తుండకపోవడం, మైండ్ ఖాళీగా అనిపించడం, మనసు భారంగా తోచడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీనినే “డూమ్ స్క్రోలింగ్ హ్యాంగోవర్” అని కూడా అంటారు.

ఎందుకు వస్తుంది?

సోషల్ మీడియాలో ప్రతీ కొత్త పోస్ట్/రీల్ వెంటనే చిన్న డోపమైన్ హిట్ ఇస్తుంది. అంటే దానిని స్క్రోల్ చేస్తున్నంతసేపు మెదడు “ఇంకా.. ఇంకా..” అని అడుగుతుంది. ఎంతసేపు చూసినా ఇంకా ఏదో చూస్తూ, స్వైప్ చేస్తూ, స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎంతకీ తృప్తి అనేది ఉండదు. ఒకప్పుడు పేజీలకు ఎండింగ్ లేదా ముగింపు ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం ఉండట్లేదు. పైగా ఇక్కడ ఫోమో (FOMO) +అల్గారిథమ్ మానిప్యులేషన్‌కు గురవుతుంటాం. అంటే ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటిని మిస్ అవుతామేమో అనే భయం + అల్గారిథమ్ యూజర్ల బలహీనతలకు తగ్గట్టు కంటెంట్ ఇస్తూ ఉంటుంది. దీంతో చివరికి అలసిపోవడం, శ్రద్ధ తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. 2010–2024 మధ్య సగటు డూమ్ స్క్రోలింగ్ కారణంగా అటెన్షన్ స్పాన్ 12 సెకన్ల నుంచి 8 సెకన్లకు పడిపోయిందని మైక్రో‌సాఫ్ట్ (Microsoft) & ఇతర స్టడీస్ పేర్కొంటున్నాయి. బ్లూ లైటింగ్, అంతులేని నోటిఫికేషన్స్, ఆటోప్లే వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నాయి.

పరిష్కారం ఏమిటి?

*ఇన్ఫినిట్ స్క్రోల్ ఫెటీగ్.. అంటే సోషల్ మీడియా యాప్‌ల అధిక వినియోగం, స్ర్కోలింగ్ వల్ల వచ్చే అలసట నుంచి బయటపడేందుకు గంటల తరబడి సమయాన్ని కేటాయించడం మానుకోవాలి. అందుకోసం యాప్ టైమర్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే వినియోగించేటప్పుడు గ్రే స్కేల్ మోడ్ ఆన్ చేయడంతో రంగులు లేకపోవడంవల్ల స్క్రోల్ చేసే సందర్భంలో కంటెంట్ ఆకర్షణ తగ్గుతుంది. దీంతోపాటు నోటిఫికేషన్స్ పూర్తిగా ఆఫ్ చేయడం, ముఖ్యమైనవి మాత్రమే ఉంచడం చేయాలి. రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు లేదా మీకు నచ్చిన మరో సమయంలో “Do Not Disturb” షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు.

*స్మార్ట్ ఫోన్‌కు బదులు జస్ట్ కాల్స్ మాత్రమే చేయడానికి, రావడానికి ఉపయోగపడే చిన్న ఫోన్లు, మీడియం-టర్మ్“డంబ్‌ఫోన్” లేదా “లైట్ ఫోన్”లు ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా యాప్స్‌ను ఫోన్ నుంచి తొలగించి, బ్రౌజర్‌లో మాత్రమే ఉపయోగించడం చేయవచ్చు. దీంతో లాగిన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉపయోగం తగ్గుతుంది. “One Tab” ఎక్స్‌టెన్షన్ ఉపయోగిస్తే ఒకొత్త ట్యాబ్ ఓపెన్ చేసిప్పుడు ఎంప్టీ పేజీ వస్తుంది. కాబట్టి స్క్రోల్ చేయాలన్న ఆసక్తి తగ్గుతుంది. వారానికి ఒక రోజు పూర్తి డిజిటల్ డిటాక్స్ (24 గంటలు ఫోన్ ఆఫ్)‌ను అనుసరించవచ్చు. దీంతో ఎల్లప్పుడూ కాకుండా తక్కువగా లేదా అవసరానికి మాత్రమే స్క్రోల్ చేయడం అలవాటుగా మారుతుంది. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇటీవల జెన్‌జీలలో ఇది తగ్గుతూ వస్తోందని నిపుణులు అంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్ కంటెంట్ వ్యూయింగ్ 22% నుండి 17%కి తగ్గింది. 2024 ప్యూ రీసెర్చ్ స్టడీ ప్రకారం.. టీనేజర్‌లలో సగం మంది ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. దీంతో యువతలో అలసట, ఆందోళన, డిజిటల్ రిబెలియన్‌కు దారితీస్తోంది. అయితే ఇటువంటి సమస్యలే ఇప్పుడు జెన్ Z లో మార్పుకు కారణం అవుతున్నదని నిపుణులు అంటన్నారు ప్రతీ ఐదుగురిలో ఒకరు వినియోగదారులు డిజిటల్ డిటాక్స్ చేస్తున్నారు.

Next Story