ఎనర్జీని పెంచే సూపర్ ఫుడ్.. ఖర్జూరం, వెన్న కలిపి తింటే..!

by Javid Pasha |   (  Updated:2026-04-25 17:46:23  IST  )

ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి కార్బోహైడ్రేట్లు త్వరగా శక్తిని అందిస్తాయి. వెన్నలోని హెల్తీ ఫ్యాట్స్ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.

ఎనర్జీని పెంచే సూపర్ ఫుడ్.. ఖర్జూరం, వెన్న కలిపి తింటే..!
X

దిశ, ఫీచర్స్: మనం రోజువారీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలంటే అందుకు తగిన ఎనర్జీ ఉండాల్సిందే. సహజంగానే ఇది ఆహారాల ద్వారా లభిస్తుంది. అయితే ఖర్జూరంతో వెన్న కలిపి తినడం ఇందుకు మరింత ఎక్కువగా సహాయపడుతుందని, ఇదొక ఎనర్జీడెన్‌గా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంకా ఏయే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం పదండి.

వెన్న, ఖర్జూరం కలిపిన స్నాక్స్ లేదా ఆహారం కండరాల పటుత్వాన్ని, శరీరంలో శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి కార్బోహైడ్రేట్లు త్వరగా శక్తిని అందిస్తాయి. ఇక వెన్నలోని హెల్తీ ఫ్యాట్స్ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. దీంతో చక్కెర రక్తంలోకి స్లోగా విడుదలవుతుంది. ఇది త్వరిత ఎనర్జీతోపాటు దీర్ఘకాలిక శక్తిని కూడా ఇస్తుంది. అందుకే చాలామంది ఉపవారం తర్వాత, జిమ్‌లో వ్యాయామాల తర్వాత ఖర్జూర వెన్న కాంబినేషన్‌తో తయారు చేసిన స్నాక్స్ తింటుంటారు. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి జీర్ణక్రియను మెరుగు‌పరచడంలో, ఎనర్జీ లెవెల్స్ స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

వెన్న ఫ్యాట్-సాల్యుబుల్ విటమన్లను, హెల్తీ ఫ్యాట్‌ను అందిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ స్పైక్ తగ్గి, శక్తి లభిస్తుంది. కాబట్టి వెన్నతో కలిసి ఒకటి రెండు ఖర్జూరాలు తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలామంచిది అంటున్నారు నిపుణులు. అలాగనీ మరీ ఎక్కువ తినవద్దు. ఇలా చేస్తే కేలరీలు పెరుగుతాయి. కాబట్టి పరిమితి ముఖ్యం. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఖర్జూరంలో GI తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఫైబర్ + ఫ్యాట్ కలయిక కాబట్టి శక్తిని స్థిరంగా ఉంచుతుంది. అందుకే ఖర్జూరం వెన్నతో కలిపి తినడం మీ ఆరోగ్య జీవితాన్ని మరింత మెరుగు పరుస్తుందని నిపుణులు అంటున్నారు.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More.. మెగ్నీషియం లోపంతో టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌.. ఏం చేయాలంటే?

Next Story