- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటి ఆరోగ్యం మొదలుకొని చర్మసౌందర్యం వరకు.. క్యారెట్ చేసే అద్భుతాలెన్నో..!
కంటి ఆరోగ్యం మొదలుకొని చర్మసౌందర్యం వరకు.. క్యారెట్ చేసే అద్భుతాలెన్నో..!

దిశ, ఫీచర్స్ : క్యారెట్ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. డైలీ ఒకటి తినాలని, క్యారెట్ జ్యూస్ తాగాలని నిపుణులు కూడా సూచిస్తుంటారు. కానీ ఎందుకు మంచిది? ఎంత మంచిది? అనే విషయంలో సందేహాలు కూడా వ్యక్తం అవుతుంటాయి. అయితే ఇందులో విటమిన్ ఎ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌ను తినడంవల్ల, జ్యూస్ తాగడంవల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. అవేమిటో చూద్దాం.
పోషకాలు ఫుల్
క్యారెట్లను పచ్చిగా తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఉడించి తినడం ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. డైలీ ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగినా ఎంతో మంచిది. ఎందుకంటే 250 ఎం.ఎల్ క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు 96, ప్రోటీన్ 2 గ్రాములు, కొవ్వు ఒక గ్రాము కంటే తక్కువ, పిండి పదార్థాలు 22 గ్రాములు, చక్కెరలు 9 గ్రాములు, ఫైబర్ కంటెంట్ 2 గ్రాములు, విటమిన్ ఎ 255 శాతం, విటమిన్ సి 23 శాతం, విటమిన్ కె 31 శాతం, పొటాషియం 15 శాతం ఉంటాయి.
కొలెస్ట్రాల్‌కు చెక్
క్యారెట్లలో బీటా కెరోటిన్ కంటెంట్ ఉండటంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ ఒకటి లేదా రెండు క్యారెట్లు తిన్నా కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుంది. ఇక చిన్న పిల్లలకు తినిపించే ఆహారంలో కూడా క్యారెట్ చేర్చడం మంచిదంటున్నారు నిపుణులు. క్యారెట్‌ను గ్రైండ్ చేసి ఆ రసాన్ని తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు పోతాయి. క్యారెట్‌లో తేనె కలుపుకొని తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెప్తారు.
కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు
క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో చూపు మందగించే సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాంగే ఇందులోని ల్యూటిన్, జియాక్సంతిన్ కాంతి వల్ల కండ్లు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఏజ్ రిలేటెడ్ కంటి సమస్యలను అడ్డుకోవడంలో క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది.
డయాబెటిక్ పేషెంట్లకు..
డయాబెటిక్ పేషెంట్లు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సజెష్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. క్యారెట్లు కూడా అందుకు చక్కటి మూలం. తరచుగా దీని జ్యూస్ తాగడంవల్ల గట్ హెల్త్‌కు మంచిదంటున్నారు నిపుణులు.
చర్మ ఆరోగ్యానికి..
విటమిన్ సి కూడా ఉండటంవల్ల క్యారెట్లు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తరచుగా తినడంవల్ల శరీరంలో స్కిల్ హెల్త్ అండ్ గ్లో కోసం అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే కెరోటీనాయిడ్స్ సూర్యుడి యూవీ కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.
క్యాన్సర్ నివారణకు
తరచుగా క్యారెట్లను ఉడకబెట్టి గానీ, ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల గానీ క్యాన్సర్ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొంటాయి. రెగ్యులర్‌గా తినడంవల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు క్యారెట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్యారెట్లను తప్పక తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






