- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nutrition : ఆ సమస్యలు వేధిస్తున్నాయా? క్యాప్సికం తినండి!
Nutrition : ఆ సమస్యలు వేధిస్తున్నాయా? క్యాప్సికం తినండి!

దిశ, ఫీచర్స్ : ఆహారంలో భాగంగా మనం తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. అయితే దీనిని తరచుగా తినడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో సహాయపడతాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
*క్యాప్సికంలో దాదాపు అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అలాగే తరచుగా తినడంవల్ల ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని, రక్త హీనతను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం మూలంగా అధిక బరువును, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. బీటా కెరోటిన్ ఉండటంవల్ల క్యాప్సికం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. దృష్టి లోపాలు, ముఖ్యంగా రేచీకటి వంటివి రాకుండా ఉంటాయి. అలాగే లుటిన్, జియాక్సింతిన్ పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఉండటంవల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది.
*ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు మూలం కాబట్టి క్యాప్సికం హైకొలెస్ట్రాల్ నివారణలో మంచి ఆహారంగా చెప్పవచ్చు. గుండె జబ్బులు, చర్మ రోగాలను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖంపై వృద్ధాప్య ఛాయలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా సహాయపడే పోషకాలు క్యాప్సికంలో ఉంటాయి.
*క్యాప్సైసిన్ అనే పోషకం వల్ల చర్మ వ్యాధుల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిండంలో క్యాప్సికం అద్భుతమైన ఆహారం. అట్లనే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వివిధ అంటు వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్లు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు క్యాప్సికంలో ఉన్నాయి. కాబట్టి ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.






