కంటి చూపును మెరుగు పరిచే నాచురల్ మెడిసిన్..! స్వీట్ పొటాలో పుష్కలంగా ఉంటున్న విటమిన్ ఎ..

by Javid Pasha |

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం.. మీడియం సైజ్ కాల్చిన లేదా ఉడకబెట్టిన చిలకడ దుంపలొ 1,096 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉంటుంది

కంటి చూపును మెరుగు పరిచే నాచురల్ మెడిసిన్..! స్వీట్ పొటాలో పుష్కలంగా ఉంటున్న విటమిన్ ఎ..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో కంటిచూపు మందగించడం ఒకటి. అధిక స్క్రీన్ సమయం, పోషకాహార లోపం కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే అలాంటి సమస్య రాకుండా సిహజ సిద్ధమైన పద్ధతిలో తినే ఆహారాల ద్వారానే మీ కళ్లను కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి అద్భుతమైన ఆహారాల్లో స్వీట్ పొటాటో(చిలగడ దుంప) ఒకటి. దీనివల్ల కంటిచూపు మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం.. మీడియం సైజ్ కాల్చిన లేదా ఉడకబెట్టిన చిలకడ దుంపను వారానికోసారి తిన్నా కంటి సమస్యలు తలెత్తే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఒక మీడియం సైజ్(సుమారు 114 గ్రాములు) స్వీట్ పొటాలోలో బీటా-కెరోటిన్ రూపంలో 1,096 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. ఇది వయోజనులకు సిఫారసు చేసిన రోజువారీ మొత్తం (DV) కంటే 400% ఎక్కువట. ఈ సాధారణ దుంప శరీరానికి అవసరమైన విటమిన్ ఎను సహజంగా సమకూర్చి, దాన్ని యాక్టివ్ ఫార్మ్‌గా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కాల్చిన లేదా ఉడకబెట్టిన చిలగడ దుంపలోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని, చర్మ కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. మరో విషయం ఏమిటంటే.. చిలకడ దుంపలోని బీటా-కెరోటిన్ శరీరం అవసరానికి అనుగుణంగా విటమిన్ ఎగా మారుతుంది. కాబట్టి దీనిని తింటే ప్రత్యేకంగా విటమిన్ ఎ మెడిసిన్ వేసుకోకపోయినా కలిగే ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. Link

Next Story