- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple : యాపిల్ vs యాపిల్ జ్యూస్.. రెండింటిలో ఏది మంచిది?
Apple : యాపిల్ vs యాపిల్ జ్యూస్.. రెండింటిలో ఏది మంచిది?

దిశ, ఫీచర్స్ : యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్రూట్ అని తెలిసిందే. అందుకే హెల్త్ పరంగా వీక్‌గా ఉన్నవారికి రోజుకో యాపిల్ తినాలని కూడా పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే కొందరు యాపిల్‌ను తినేకంటే, జ్యూస్ తాగితే మంచిదని, ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతుంటారు. ఇది నిజమేనా? యాపిల్ తినడం మంచిదా? జ్యూస్ తాగడం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ పండ్లను తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం.. రెండింటిలో ఏది ఎనర్జిటిగ్‌గా ఉంటుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే నిపుణుల ప్రకారం.. మనం యాపిల్ తినేటప్పుడు ఒకటో రెండో తినగలం. కానీ జ్యూస్ చేసేటప్పుడు మాత్రం అలాంటి లిమిట్ దాదాపు పాటించరు. ఇక్కడ నాలుగైదు యాపిల్స్ వాడుతుంటారు. అంటే జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు మనం ఎక్కువ యాపిల్స్ తిన్నట్లు లెక్క. ఏది కూడా ఒకేసారి అతిగా తినడం, తాగడం మంచిది కాదన్నది యాపిల్ జ్యూస్ విషయంలోనూ వర్తిస్తుంది. ఒకేసారి నాలుగైదు యాపిల్స్‌తో తయారు చేసిన జ్యూస్ తాగడంవల్ల కొన్నిసార్లు లివర్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే యాపిల్ పండ్ల రసాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు అందులోని ఫ్రక్టోజ్ అండ్ సుక్రోజ్ లెవెల్స్ శరీరంలోకి వేగంగా ప్రవేశిస్తాయి. ఇవి కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులకు కారణం కావడంవల్ల అనారోగ్యాలకు, అలర్జీలకు దారితీస్తాయి.
యాపిల్స్ ఒక వ్యక్తి తిన్న ప్రతీసారి మహా అయితే ఒకటో రెండో తింటారు. పైగా వీటిలోని ఫైబర్ కంటెంట్, ఇతర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, కాపర్, విటమిన్ కె వంటి పోషకాలు కూడా యాపిల్‌ను సహజంగా తినడంవల్ల లభిస్తాయి. యాపిల్స్‌లోని ఫైబర్ బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును, నొప్పిని తగ్గిస్తాయి. టైప్ 2 యాబెటిస్, గుండె జబ్బుల రిస్క్ తగ్గించడంలోనూ యాపిల్ పండ్లలోని పోషకాలు సహాయపడతాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. సో.. ఒక విధంగా యాపిల్ జ్యూస్ కంటే, యాపిల్‌ను నార్మల్‌గా తినడమే బెటర్.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






