- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Barley water : ఎండకు అలసిపోతున్నారా..? బార్లీ వాటర్‌తో కూల్ అవ్వండిలా..
Barley water : ఎండకు అలసిపోతున్నారా..? బార్లీ వాటర్‌తో కూల్ అవ్వండిలా..

దిశ, ఫీచర్స్ : ఎండాకాలంలోకి ఇంకా పూర్తిగా ఎంటర్ అవ్వనేలేదు. కానీ పగటిపూట ఎండలు బాగానే కొడుతున్నాయి. ఇక మధ్యా్హ్నం అయితే జనాలు ఉక్కబోతలతో ఇబ్బంది పడుతున్నారు. బయట తిరిగేవారు ఉబ్బరంతో, అధిక చెమటలతో, అలసటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటప్పుడే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది ఎవరికైనా.. దీంతో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అధిక చక్కెరస్థాయిలు ఉండటంవల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి వాటిలో బార్లీ వాటర్ ఒకటి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
* బార్లీలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గట్ బాక్టీరియాను బ్యాలెన్స్ చేయడం ద్వారా జీర్ణాశయాంతర సమస్యలను నివారిస్తుంది. కాబట్టి బార్లీని మిక్స్ చేసిన వాటర్ లేదా జ్యూస్ తాగడంవల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా కడుపులో ఉబ్బరం, ఎండవల్ల తలెత్తే చికాకు వంటివి తగ్గుతాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
* అధిక రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలోనూ బార్లీ వాటర్ సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్కును నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తే బార్లీ వాటర్ తీసుకోవడం మంచిది. సన్ స్ట్రోక్ ప్రభావం తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
*బార్లీ వాటర్ అప్పుడప్పుడు లేదా ప్రతిరోజూ తాగడంవల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, మలబద్ధకం, ఛాతీలో మంట వంటి ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. గర్భిణులు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల కాళ్ల వాపు సమస్య రాకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బార్లీ నీళ్లు తాగితే అలసట దూరం అవుతుందని, తాగితే పుట్టుబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్లు, వివిధ అలెర్జీలను తగ్గించడంలోనూ బార్లీవాటర్ కీ రోల్ పోషిస్తుంది.
Read More: వచ్చేస్తోన్న వేసవికాలం.. తినాల్సిన పండ్లు ఇవే..?






