- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ విషయాలనూ సీరియస్‌గా తీసుకోరు..! ఇలాంటి వారే సంతోషంగా ఉంటారు..!!
బాధాకరమైన, భావోద్వేగ సందర్భాలను సైతం సింపుల్‌గా భావించడం, వ్యంగ్యంగా, హాస్యంగా వ్యాఖ్యానించడం వంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే..

దిశ, ఫీచర్స్ : మనం ప్రతిరోజూ అనేక మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కో విధంగానూ అనిపిస్తూ ఉంటుంది. ఆలోచనలు, ప్రతిస్పందనలు, భావోద్వేగాలు, బాధలు, సంతోషాలు వంటివన్నీ మనుషులందరకీ సహజమే అయినా.. వాటిని స్వీకరించే విధానం, ఆలోచించే తీరు, విశ్లేషించే సామర్థ్యం ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ‘డార్క్ హ్యూమర్ (Dark humor)’ బిహేవియర్ కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. విషయం ఏదైనా, అది ఎంత సీరియస్‌నెస్ కలిగింది అయినా తేలిగ్గా తీసుకోవడం, చమత్కరించడం, బాధాకరమైన విషయాలను సైతం సింప్లిఫై చేయడం వీరి ప్రవర్తనలో కనిపిస్తుంది. అయితే ఇలాంటి వారే జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉండే అవకాశం ఉందని ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది.
మనుషులు భిన్నమైన సందర్భాల్లో భావోద్వేగాలను ఎలా మేనేజ్ చేస్తారో తెలుసుకునేందుకు మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ వియన్నా(Medical University of Vienna)కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు 33 సంవత్సరాలలోపు వయస్సు గల 156 మందిని అబ్జర్వ్ చేశారు. వీరిలో 70 మందికిపైగా మహిళలు కూడా ఉన్నారు. కాగా ఆయా సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను, బాధాకరమైన, అత్యవసరమైన పరిస్థితులను, భావోద్వేగాలను వీరంతా ఎలా ఎదుర్కొన్నారో, అవి వాళ్ల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయో ఎనలైజ్ చేశారు.
పరిశోధకుల ప్రకారం.. బాధాకరమైన, భావోద్వేగ సందర్భాలను సైతం సింపుల్‌గా భావించడం, అందరూ ఆందోళన చెందే విషయాలను సైతం సీరియస్‌గా తీసుకోకపోవడం, పైగా ఆయా సందర్భాల్లో వాటిని వ్యంగ్యంగా, హాస్యంగా వ్యాఖ్యానించడం వంటివి చేసే వ్యక్తులను గుర్తించడమే కాకుండా, ఇలాంటి వారు చాలా సంతోషంగా ఉంటున్నారని కనుగొన్నారు. వీరినే డార్క్ హ్యూమర్స్ (Dark humor)గా పేర్కొంటున్నారు. వీరిలో భావోద్వేగ స్థిరత్వం, ఐక్యూ లెవల్ కూడా ఎక్కువేనని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ విధమైన ప్రవర్తన కలిగిన వ్యక్తుల్లో జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందని, జీవితంలో మానసిక రుగ్మతలను, అనారోగ్యాలను సైతం ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. చివరికి మరణం, వ్యాధి, వైకల్యం వంటివి కూడా డార్క్ హ్యూమర్స్ చాలా సింపుల్ విషయాలుగానే చమత్కరిస్తుంటారు. ఇలాంటి ధోరణియే సదరు వ్యక్తుల జీవితాన్ని ఆనందమయం చేస్తుందని నిపుణులు అంటున్నారు. Link






