- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seasonal Diseases : వాతావరణం మారితే జ్వరం ఎందుకొస్తది..? ఏం చేయాలె?
Seasonal Diseases : వాతావరణం మారితే జ్వరం ఎందుకొస్తది..? ఏం చేయాలె?

దిశ, ఫీచర్స్ : వానకాలం ఎండింగ్‌లో.. చలికాలంలోకి ఎంటరయ్యే సమయంలో చాలా మంది అనారోగ్యాలకు గురవుతుంటారు. అట్లనే చలికాలం ఎండింగ్‌లో ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు అదే జరుగుతుంది. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, అలర్జీలు, కంటి వ్యాధులు, వైరల్ ఫీవర్లు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం ఈ సీజనే నడుస్తున్నది. ఇట్లా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి మారుతున్నప్పుడు నెలకొనే వాతావరణ పరిస్థితుల్లో ఎందుకని అట్లా జరుగుతుంది? అలాంటప్పుడు ఏం చేయాలె అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం పదండి.
*వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు, అనారోగ్యాలు వంటివి కామనే. అయినప్పటికీ కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చు. అయితే సీజన్లు మారే క్రమంలో అనారోగ్యాలకు అనేక కారణాలు ఉంటాయి. వాతావరణం పొడిగా మారడం, గాలి కాలుష్యం ఏర్పడటం వంటివి దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులు, అలెర్జీలు, కంటి వ్యాధులు వంటి అనారోగ్యాలకు, అట్లనే శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంటాయి. అందుకే ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి ఎంటరవుతున్న సమయంలో జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొడి వాతావరణం, గాలి కాలుష్యం వంటివి ఉన్నప్పుడు బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించాలి. జ్వరం, జలుబు వంటి సీజనల్ సమస్యలను నివారించడంలో బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం లేదా కర్చీఫ్ ముఖానికి కట్టుకోవడం వంటివి 60 శాతం వరకు సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* ప్రస్తుతం వేసవిలోకి ఎంటరయ్యే వాతావరణ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో అటు పూర్తి చలి ఉండదు. ఇటు పూర్తి ఎండ కూడా ఉండదు. ఉదయం, సాయంత్రం భిన్నమైన వాతావరణినికి గురవుతుంటాం. దీంతో చర్మం పొడిగా మారుతుంది. బయటి వాతావరణంలోని దుమ్ము కణాలకు గురికావడంవల్ల జలుబు, గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బయటి నుంచి రాగానే స్నానం చేయడం, బయటకు వెళ్లేటప్పుడు దుమ్ముకు గురికాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ముఖ్యం.
*సీజనల్ వ్యాధులు, వాతావరణ మార్పులవల్ల అనారోగ్యాలు కలుగకుండా ఉండాలంటే మనలో తనగినంతగా రోగ నిరోధక శక్తి ఉండాలి. అందుకోసం రోజువారి ఆహారంలో భాగంగా తగిన పోషకాలు తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, ఆకు కూరలు అందుకు సహాయపడతాయి. సీజన్ల వారీగా వచ్చే పండ్లను తప్పక తినాలి. దీంతోపాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి తగినంతగా నీరు తాగాలి. సగటున ఆరోగ్యవంతమైన వ్యక్తులు పురుషులైతే రోజుకు 3 లీటర్లు, మహిళలైతే రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అందరికీ ఒకే విధమైన ప్రమాణం కూడా వర్తించదు. వయసు, బరువు, జీవక్రియ, ఆహారం, శారీరక శ్రమను బట్టి కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ నీరు అవసరం కావచ్చు. మొత్తానికి ఎంత నీరు కావాలనేది మీ శరీర తత్వాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






