- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI & Jobs : ఏఐ మాత్రమే సర్వస్వం కాదు భయ్యా..! మనుషులు లేని ఆ లోటును అది తీర్చలేదు.. !!
AI & Jobs : ఏఐ మాత్రమే సర్వస్వం కాదు భయ్యా..! మనుషులు లేని ఆ లోటును అది తీర్చలేదు.. !!

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన అద్భుతమైన మార్పుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(A.I) ఒకటి. దీని ప్రవేశంతో ఆయా రంగాల్లో సేవలు సులభతరం అవుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఎనలైజింగ్, డేటా డెవలప్‌మెంట్‌లోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సాంకేతికత చాలా అవసరం. అలాగనీ పూర్తిగా దీనిపైనే ఆధారపడితే మాత్రం నష్టపోవాల్సి వస్తుందని సాంకేతిక నిపుణులే అంటున్నారు. ఎందుకంటే అనేక విషయాల్లో మానవులు లేనిలోటును ఏఐ తీర్చలేదని చెబుతున్నారు. అందుకు స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా(Klarna ) నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఇంతకీ AI ఏ లోటును తీర్చలేదు. క్లార్నాలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అది ఎంత మోడర్న్ టెక్నాలజీ (Modern technology) అయినా మానవ శ్రమ, సృజనాత్మకత కలబోసుకోవడం వల్లే రూపొందుతుంది. ఏఐ కూడా దానికి అతీతం కాదంటున్నారు నిపుణులు. సమాజ అభివృద్ధికి, సరికొత్త మార్పులకు, ఆయా పనులు, సేవలను సులభతరం చేయడంతోపాటు నిర్వహణలో మెరుగుదలకు ఏఐ చాలా అవసరమే. అలాగని ప్రతీ విషయంలో సాంకేతికతనే ఉపయోగించుకుంటూ మానవ వనరులను, శ్రమను, సేవలను, సృజనాత్మకతను విస్మరిస్తే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి స్థానాన్ని టెక్నాలజీ పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు.
సాంకేతికత అన్ని విషయాల్లో మనిషి స్థానాన్ని భర్తీ చేయలేదనడానికి స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా(Swedish fintech company Klarna) అనుభవమే చక్కటి ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఇదేం చేసిందంటే.. కంపెనీ నిర్వహణలో మరింత సామర్థ్యాన్ని పెంచడం, కార్యాచరణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పేర్కొంటూ 2022లో 700 మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. బదులుగా ఆయా పనుల నిర్వహణకు ఓపెన్ ఏఐ(OpenAI) ద్వారా డెవలప్ చేయబడిన ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టింది. అనేకమంది చేయగల పనిని ఒక్క ఏఐ సిస్టమ్ చేయగలదనే ధీమా ఇలా చేసిన కంపెనీ చివరికి దివాలా తీసింది.
2025 నాటికి క్టమర్ సర్వీస్(Customer service), ఉత్పత్తి విశ్వసనీయత(product reliability)లో కావలసిన క్వాలిటీని అందించడంలో ఏఐ (AI) వ్యవస్థలు విఫలమైనట్లు అంగీకరించిన క్లార్నా తాను చేసిన పొరపాటేమిటో గ్రహించింది. మానవ వనరుల ద్వారా చేయగల అన్ని పనులను ఏఐ ద్వారా భర్తీ చేయలేమని తాజాగా అంగీకరించిన ఆ కంపెనీ ప్రస్తుతం మళ్లీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. క్రియేటివిటీ, బిజినెస్ యాక్టివిటీస్(Business Activities), క్వాలిటీ ప్రొడక్షన్, కస్టమర్ సర్వీస్‌లో మెరుగైన సేవలు వంటి విషయంలో ఎంత సాంకేతికతను ఉపయోగించినా, మానవ రహితంగా మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యం కాదని, క్లార్నా అనుభవమే అందుకు చక్కటి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.






