- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : ఏఐ విశ్వవ్యాప్తం..! వివిధ రంగాల్లో విస్తరిస్తున్నసేవలు
హ్యూమనాయిడ్ రోబోట్స్ సేవలు వివిధ రంగాల్లో విస్తరిస్తూ మానవులకు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పనులను మరింత సులభతరం చేస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక ఎన్ని మార్పులు వస్తున్నాయో తెలిసిందే. ఈ సాంకేతికత ఆధారంగా రూపొందించబడిన చాట్‌బాట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ సేవలు వివిధ రంగాల్లో విస్తరిస్తూ మానవులకు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పనులను మరింత సులభతరం చేస్తున్నాయి. అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తున్నాయి. అలాంటి వాటిలో కన్‌స్ట్రక్షన్ రోబోట్స్ మొదలుకొని, బోస్టన్ డైనమిక్స్- అట్లాస్ రోబోట్స్ వరకు ఎన్నో ఉన్నాయి. ఏయే రంగాల్లో ఏ విధంగా ఉపయోపడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* నిర్మాణ రంగం : ప్రస్తుతం రోజు రోజుకు విస్తురిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. కాగా ఈ సెక్టార్‌లో సేవలను సులభతరం చేసేందుకు ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్ బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇవి మానవుల కంటే 10 రెట్లు వేగంగా వివిధ నిర్మాణాలను, పెద్ద పెద్ద భవంతులను నిర్మించడంలో సహాయపడుతున్నాయి. మోడ్రన్ టెక్నాలజీతో కచ్చితమైన డిజైన్లను అమలు చేస్తాయి. ఇవి శ్రమను తగ్గించి, సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తాయి.
* రోడ్డు రవాణా రంగం : ఈ రంగంలో రోడ్ సైన్ రోబోట్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రోడ్లపై అవసరమైన చోట హెచ్చరికలు, సంకేతాల ఏర్పాటు(Installation of road signs)ను ఈ రోబోట్లు ఆటోమేటిగ్గా హ్యాండిల్ చేస్తాయి. రోడ్డు మార్గాల్లో సైన్‌బోర్డులను ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించడంతో పాటు కచ్చితమైన ప్రదేశంలో మాత్రమే ఉంచేలా సూచనలు సలహాలు, సూచనలు అందిస్తాయి. మానవ తప్పిదాలను తగ్గించి, రోడ్డు భద్రతను పెంచడంలో సహాయపడతాయి. పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి.
* సినీ రగంలో : సినీ రంగంలోనూ చాట్ బాట్స్, రోబోట్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్నిచోట్ల వాటి సేవలు అందుతున్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బోస్టన్ డైనమిక్స్ డెవలప్ చేసిన అట్లాస్ రోబోట్ ఇప్పుడు కెమెరామెన్‌గానూ పనిచేస్తోంది. సినిమా షూటింగ్‌లలో కచ్చితమైన కెమెరా యాంగిల్స్‌ను (Captures camera angles) క్యాప్చర్ చేయడంలో ఇది అచ్చం మనుషుల్లాగే బ్యాలెన్స్‌గా కదలగలదు. ఇలాంటివి మరిన్ని అందుబాటులోకి వస్తే మీడియా రంగంలో వినూత్న మార్పునకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ లేదా హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేక రంగాల్లో ప్రవేశించడం ద్వారా రాబోయే రోజుల్లో సేవల్ని మరింత సులభతరం చేస్తాయని, మానవులకు సౌకర్యాన్ని కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు.






