మొటిమలు.. ఏ ప్లేస్‌లో ఉంటే ఏ అనారోగ్యం ఉన్నట్లో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-07-01 12:23:17  IST  )

మొటిమలు.. ఏ ప్లేస్‌లో ఉంటే ఏ అనారోగ్యం ఉన్నట్లో తెలుసా?

మొటిమలు.. ఏ ప్లేస్‌లో ఉంటే ఏ అనారోగ్యం ఉన్నట్లో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ముఖంపై, ముక్కుపై, నుదుటిపై.. మొటిమలు రావడం సహజం. కానీ శరీరంలోని ఆయా ఇలా తరచుగా వస్తూ, నొప్పిగా ఉంటూ ఇబ్బందికి గురిచేస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి మీ అంతర్గత ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, విటమిన్ల లోపం వంటివి కూడా అందుకు కారణం కావచ్చు. అయితే ఏ భాగాల్లో వచ్చే మొటిమలు ఏ విధమైన అనారోగ్యానికి సూచికలు, ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*కనుబొమ్మలు : కనుబొమ్మలపై మొటిమలు మీ లివర్ ఆరోగ్యం సరిగ్గా లేదనడానికి సంకేతం కావచ్చు. కాబట్టి మెరుగు పడాలంటే మిల్క్ థిస్టిల్ (milk thistle), బీట్‌రూట్ తినడం, గ్రీన్ టీ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోండి.

*నుదురు : నుదుటిపై మొటిమలు కనిపిస్తే మీ గట్ హెల్త్ సరిగ్గా లేకపోవచ్చు. డైజేషన్ ప్రాబ్లమ్, కడుపులో ఉబ్బరం వంటివి అందుకోసం పెరుగు, అల్లం, కేఫీర్ వంటివి తినడం మంచిది.

*ముక్కు : ముక్కుపై నొప్పితో కూడిన మొటిమలు తరచుగా వస్తుంటే హార్ట్ వీక్ ఉండొచ్చు లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడానికి సంకేతం కావచ్చు. రాకుండా ఉండాలంటే వాల్‌నట్స్, సాల్మన్ చేపలు, ఆవకాడో, పాలకూర వంటివి తినాలి.

*బుగ్గలు : తరచుగా బుగ్గలు లేదా చెంపలపై మొటిమలు రావడం మీ ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని సూచిస్తాయి. నివారించాలంటే బ్రోకలీ, పసుపు, క్యారెట్లు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

*చెవులు : చెవులపై మొటిమలు కనిపిస్తుంటే మీరు అప్పటికే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండవచ్చు. లేకుంటే స్టార్ట్ అయి ఉండవచ్చు. బయటపడాలంటే వెల్లుల్లి, క్రాన్‌బెర్రీస్ తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.

గడ్డం : గడ్డం (chin)పై మొటిమలు వస్తూ, నొప్పిగా ఉంటూ ఇబ్బంది పెడుతుంటే మీ శరీరం హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటున్నట్లు లెక్క. నివారణకోసం ఫ్లాక్స్‌సీడ్స్, క్వినోవా, చియా సీడ్స్ వంటివి తీసుకోవాలి.

స్వచ్ఛమైన చర్మం కోసం చిట్కాలు

* ఎక్కువ నీరు తాగండి

* పండ్లు & కూరగాయలు తినండి

* చక్కెర, జంక్ ఫుడ్‌ను పరిమితం చేయండి

* చర్మ సంరక్షణ రొటీన్‌ను అనుసరించండి

* రోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించండి

*తగినంత నిద్ర పోండి.

* ఒత్తిడిని నిర్వహించండి, ప్రతీదానికి స్ట్రెస్ ఫీల్ అవకండి.

*తరచుగా చేతులతో ముఖాన్ని తాకవద్దు

*లినెన్స్‌ను(టేబుల్‌క్లాత్‌లు, న్యాప్‌కిన్‌లు, కర్టెన్లు) శుభ్రంగా ఉంచండి

*క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Click here for the relevant link

Next Story