మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెక్నాలజీ.. పనితీరు, ప్రయోజనాలు

by Javid Pasha |   (  Updated:2026-04-26 08:21:47  IST  )

మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెక్నాలజీ క్యాన్సర్ చికిత్సలలో ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెక్నాలజీ.. పనితీరు, ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్ : రక్త నమూనాల ద్వారా క్యాన్సర్లను గుర్తించాలంటే ఒకప్పుడు పేషెంట్ నుంచి రెండుమూడుసార్లు రక్తం సేకరించేవారు. కానీ ఆధునిక సాంకేతికత వల్ల ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. ఆంకాలజీ రంగంలో ఇటీవల లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దీంతో ఒక్క రక్త నమూనా(బ్లడ్ డ్రా)తో ఒకేసారి బహుళ రకాల క్యాన్సర్లను గుర్తించే వీలు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. దీనిని మల్టి-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్(MCED) టెస్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షలు నిర్వహించేటప్పుడు రక్తంలో తిరిగే ట్యూమర్, అలాగే డీఎన్ఏ అవశేషాలు (ctDNA) లేదా నిదర్దిష్ట ప్రోటీన్లను గుర్తించడం ద్వారా పనిచేస్తాయి. అయితే ఈ సాంకేతికతను ఉపయోగించి నిర్వహించే పరీక్షల్లో 10 నుంచి 50 రకాలకు పైగా క్యాన్సర్లను ఏకకాలంలో స్క్రీన్ చేయవచ్చునని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రారంభ దశల్లో గుర్తించడానికి సహాయపడుతుంది. ఇది సాంప్రదాయ బయాప్సీల మాదిరి ఇన్వేసివ్ కాకుండా, మరింత సులభమైన విధానమని పేర్కొంటున్నారు.

మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెక్నాలజీ క్యాన్సర్ చికిత్సలలో ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని, రోగి జీవన నాణ్యతను(survival rates ) పెంచడంలో కీ రోల్ పోషిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. పైగా ఇది ఫాల్స్ పాజిటివ్‌లను తగ్గించి అనవసర మైన ఆందోళనలను, అదనపు పరీక్షలను నివారిస్తుంది. ఒక్క రక్త నమూనాతో బహుళ క్యాన్సర్లను స్క్రీన్ చేసే అవకాశంవల్ల వనరులు సమర్థవంతంగా వినియోగించడతాయని, చికిత్సలో వేగం, నాణ్యత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Next Story