- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nature & Health : వర్షం పడుతున్న శబ్దంతో యాక్టివేట్ అవుతున్న నాడీ వ్యవస్థ.. ఆ తర్వాత కలిగే ప్రయోజనాలివే..
వర్షం కురుస్తున్న శబ్దం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ప్రకృతి సమతుల్యతలో రుతువులు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. వసంత రుతువు, వర్షరుతువు, శరదృతువు, హేమంత రుతువు, గ్రీష్మ రుతువు, శిశిర రుతువు ఇలా ప్రతీ రుతువు రెండు నెలలపాటు కొనసాగుతుంది. అయితే ఇందులో దేనిప్రాధాన్యత దానిదే. అయినప్పటికీ, వర్ష రుతువుకు మరో ప్రత్యేకత కూడా ఉందంటున్నారు ప్రకృతి వైద్యులు. ముఖ్యంగా వర్షం పడుతున్న సందర్భాన్ని ఆస్వాదించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు సైతం పేర్కొంటున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి వర్షం మానవాళిక ఒక అవసరం. అయితే అది కురస్తున్నప్పుడు ప్రత్యేకించి మీరెప్పుడైనా గమనించారా? వాన ధారల శబ్దాన్ని వింటూ, చినుకులను చూస్తూ ఎంజాయ్ చేశారా? ఎందుకంటే.. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వర్షం కురుస్తున్న వేళ వినిపించే లయబద్ధమైన శబ్దం శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా ప్రమాదకరమైన హార్ట్ రేట్‌ను, అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుందని పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇది రిలాక్సేషన్‌ను అందిస్తుంది. జీర్ణ వ్యవస్థకు పరోక్షంగా మేలు చేస్తుంది. కాబట్టి వర్షం పడుతున్న శబ్దాన్ని ఆస్వాదించే స్థితిని ‘రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్’గా ప్రకృతి వైద్యులు, ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.‘ది లాస్ట్ బుక్ ఆఫ్ హెర్బల్ రెమెడీస్’ పుస్తకంలో కూడా ఇది వివరించబడినట్లు నిపుణులు చెబుతున్నారు.
బ్రైటన్ అండ్ ససెక్స్ మెడికల్ స్కూల్ (BSMS), 2017లో నిర్వహించిన అధ్యయనం కూడా వర్షం పడుతున్నప్పుడు వినిపించే ప్రకృతి సిద్ధమైన శబ్దం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నది. 2025లో ఒక ఆన్‌లైన్ వేదిక అయిన ‘ఫ్యూచరామో’లో పబ్లిషైన అధ్యయన వివరాలు కూడా వర్షం శబ్దాలు కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని పెంచుతాయని, మానసిక ఆనందాన్ని ప్రేరేపించడం ద్వారా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నాయి. అందుకే వర్షం పడుతున్నప్పుడు ఆ శబ్దాన్ని వినే అవకాశాన్ని మిస్ చేసుకోకండి అంటున్నారు కొందరు నిపుణులు. Link






