- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్ Z అమ్మాయిల్లో కొత్త ధోరణి.. దానిపట్ల పెరుగుతున్న ఆకర్షణ!
అటు సాంప్రదాయం, ఇటు ఆధునికతలతో మిళితమైన ఒక కొత్త ధోరణిని జెన్ Z యువతులు ఫాలో అవుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు సాంప్రదాయ జీవనశైలిపట్ల యువతుల్లో ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ తర్వాత మోడర్న్ లైఫ్ స్టైల్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో ఈ రెండింటికి భిన్నంగా ఒక కొత్త ట్రెండ్‌ను నేటి అమ్మాయిలు ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియా ట్రెండ్ ఎనాలిసిస్ పేర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే.. అటు సాంప్రదాయం, ఇటు ఆధునికతలతో మిళితమైన ఒక కొత్త ధోరణిని జెన్ Z యువతులు ఫాలో అవుతున్నారు. సౌకర్యం, ఆనందమయ జీవితంపట్ల ఆసక్తులే ఇందుకు కారణం అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
బాగా చదువుకోవాలి, పురుషులతో సమానంగా ఎదగాలి. ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనలతోపాటు జెన్ Z మహిళలు ట్రెడిషనల్ హౌస్‌వైఫ్ లైఫ్‌స్టైల్ పట్ల కూడా అత్యంత ఆసక్తితో ఉంటున్నారు. తాము ఏ జాబ్ చేసినా, ఏ కెరీర్‌లోకి ప్రవేశించినా దీనిని ఫాలో అవ్వాలని భావిస్తున్నారు చాలామంది యువతులు. దీంతోపాటు వంట, ఇంటి జీవితం, కుటుంబం, సంబంధాలలో సాంప్రదాయ పాత్రలవైపు ఆకర్షణ పెరుగుతోంది. ఆధునిక యువతుల్లో ఇది కొత్త మార్పును సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు సాంప్రదాయం, ఆధునికతలతో మిళతమైన జీవనశైలిని ఆకర్షణీయంగా, సంతోషకరమైనదిగా చూపించే ధోరణి ఇటీవల పెరుగుతోంది. యువతుల్లోనూ అటువంటి జీవితంపట్ల ఆకర్షణ పెరగడానికి ఇది దోహదం చేస్తోందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సాంప్రదాయం, ఆధునికతలతో మిళితమైన కొత్త రకం జీవనశైలిపట్ల యువతుల్లో ఆసక్తి, ఆకర్షణ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.






