యూత్‌లో ‘డూమ్ స్క్రోలింగ్’.. అది చెక్ చేయకుండా ఉండలేకపోతున్నారు!!

by Javid Pasha |   (  Updated:2026-03-18 09:14:45  IST  )

ఏదో కాసేపు చూద్దామనుకొని సెర్చింగ్ మొదలు పెడతారు. క్రమంగా సోషల్ మీడియాతో పాటు ఇంకెన్నో వెబ్‌సైట్స్‌లోకి ప్రవేశిస్తుంటారు చాలా మంది.

యూత్‌లో ‘డూమ్ స్క్రోలింగ్’.. అది చెక్ చేయకుండా ఉండలేకపోతున్నారు!!
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడని వాళ్లెవరైనా ఉంటున్నారా? దాదాపు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోందనే ఆందోళనలు సైతం పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఒక పూట తిండి తినకుండా అయినా ఉండగలరేమో కానీ.. మొబైల్ ఫోన్ చెక్ చేయకుండా మాత్రం ఉండలేరు అత్యధిక మంది. ఎందుకంటే రోజువారీ జీవితంలో, సోషల్ కమ్యూనికేషన్‌లో ఇది భాగమైపోయింది. ఎంటర్టైన్మెంట్ మొదలుకొని ఇన్ఫర్మేషన్ వరకు అందించగల ఏకైక వేదికైంది. అందుకే ఏమాత్రం ఖాళీ దొరికినా అందులో లీనమైపోతుంటారు జనాలు. అయితే ఇక్కడే చాలా మంది యువతీ యువకులు చిక్కుకుపోతున్నారని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇది కాస్త సమస్యగా మారుతోందని అంటున్నారు. ఇంతకీ అదేమిటి? ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.

కాసేపే కదా అనుకుంటే..

ఏదో కాసేపు చూద్దామనుకొని సెర్చింగ్ మొదలు పెడతారు. కానీ ఎంతకీ చూడటం ఆపరు. క్రమంగా సోషల్ మీడియాతో పాటు ఇంకెన్నో వెబ్‌సైట్స్‌లోకి అనుకోకుండానే.. ఆసక్తికొద్దీ క్లిక్ చేస్తూ ప్రవేశిస్తుంటారు చాలామంది. అంటే అవసరమైన సమాచారంతోపాటు అవసరంలేని విషయాలు కంటపడినా వాటిని వదలకుండా వెతుకుతూనే ఉంటారు. దీనినే ‘డూమ్ స్ర్క్రోలింగ్(Doom Scrolling)’ అంటున్నారు నిపుణులు. చాలామందిలో, ముఖ్యంగా టీనేజర్లలో ఇదొక వ్యసనంగా మారుతోందని, పలు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా విషాదకరమైన సంఘటనలు, నేరాలు, హింస, హృదయ విదారకరమైన సమాచారం కంటపడినప్పుడు చాలా మంది చదవకుండా ఉండలేరు. చదివి వదిలేస్తే పర్లేదు కానీ.. అయితే సెర్చింగే వ్యసనంగా మారిన ‘డూమ్ స్ర్క్రోలింగ్’ బాధితులు అలా చేయదరు. అలాంటి విషాదాలు, బాధలు తమకు కూడా సంభవిస్తాయేమోనని ఆలోచిస్తుంటారు. అనవసరంగా ఆందోళన చెందుతుంటారు.

వ్యసనం-పరిష్కారం

సెర్చింగ్ సమయంలో సంధంలేని అనవసర సమాచారం, బాధాకర సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పలువురిలో చికాకును కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాటి గురించి మరింత లోతుగా అన్వేషిస్తున్నప్పుడు కోపం, ఆందోళన, ఒత్తిడి, గుండె దడ, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితి హార్మోన్ల విడుదలలో హెచ్చు తగ్గులు సంభవించేందుకు కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపవచ్చు అంటున్నారు నిపుణులు. అవసరం ఉన్నా లేకున్నా.. ఫోన్ చూస్తూ, ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ అధిక సమయాన్ని గడపడమే ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనానికి దారిని తీస్తున్నదని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫోన్‌ గంటల తరబడి చూస్తూ గడపకుండా.. ఒక లిమిట్ మెయింటైన్ చేయాంటున్నారు నిపుణులు. దీంతోపాటు ప్రృతిలో గడపడం, ఫ్యామిలీ, పిల్లలు, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేయాలి. పరిస్థితిలో మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించవచ్చు.

Next Story