బొద్దింకలుంటే.. పిల్లలకు ఆస్తమా పక్కా! 85% కేసులకు అవే కారణం

by Javid Pasha |   (  Updated:2025-11-20 13:31:08  IST  )

బొద్దింకల ఈకలు, లాలాజలం, చర్మంపై ఉండే పొట్టులోని ప్రోటీన్స్ గాలి ద్వారా ముక్కు, ఊపిరితిత్తుల్లోకి చేరడంతో అలర్జీలు, ఆస్తమా వస్తాయి

బొద్దింకలుంటే.. పిల్లలకు ఆస్తమా పక్కా! 85% కేసులకు అవే కారణం
X

దిశ, ఫీచర్స్ : మీ ఇంట్లో, కార్యాలయాల్లో బొద్దింకల బెడద పెరిగిపోయిందా? అయితే జర జాగ్రత్త! ఎందుకంటే దీర్ఘకాలంపాటు బొద్దింక(cockroaches )లకు గురికావడం, ముఖ్యంగా అవి తిరుగాడుతున్న సందర్భంగా విడుదల చేసే పదార్థాలు ఊపిరి తిత్తుల అనారోగ్యానికి, అలర్జీలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ కో-ఆపరేటివ్ ఇన్నర్ సిటీ ఆస్తమా స్టడీ(National Cooperative Inner-City Asthma Study), అలాగే అలర్జీ ‘2016 అలర్జీ జర్నల్’ రివ్యూ అధ్యయన వివరాలు సైతం ఇదే చెబుతున్నాయి.

గాలిద్వారా లంగ్స్‌లోకి

బొద్దింకలు(cockroaches) ఎక్కువైనప్పుడు అవి ఇంటిలోపల ఇటూ ఇటూ తిరుగుతుంటాయి. ఈ సందర్భంగా వాటి ఈకలు(droppings), లాలాజలం (saliva), చనిపోయిన బొద్దింకల శరీర భాగాలు, చర్మంపై ఉండే పొట్టు(shed skin)లోని ప్రోటీన్స్ (Bla g 1, Bla g 2, Per a 1) వంటివి సహజంగానే గాలిలో కలిసిపోతుంటాయి. 5 మైక్రాన్ల కంటే కూడా చిన్నగా ఉండే ఈ ప్రోటీన్లు గాలి ద్వారా ముక్కు, ఊపిరితిత్తుల్లోకి సులువుగా చేరతాయి. కాబట్టి కాక్రో‌చ్‌లు ఉండే ప్రదేశంలో ఎక్కువసేపు గడపాల్సిన జీవనశైలి వల్ల ఆస్తమా వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల్లో అస్తమాకు అవే కారణం

సీడీసీ, డబ్ల్యుహెచ్ఓ (CDC & WHO) గణాంకాల ప్రకారం కూడా.. నగరాల్లో ఉండే పిల్లల్లో 85% అస్తమా కేసులకు బొద్డింకల నుంచి వెలువడే అలర్జెన్స్ (Allergens) లేదా విసర్జితాలే ప్రధాన కారణం. అమెరికాలోని 23-60% నగరాల్లోని ఇళ్లల్లో ఈ అలర్జెన్స్ ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒక్క బొద్దింక రోజుకి 1,000 అలర్జెన్ పార్టికల్స్‌ను విడుదల చేస్తుంది. ఇవి నెలల తరబడి గాలిలో, దుమ్ములో ఉంటాయి. 5-15 ఏండ్ల వయసుగల పిల్లల్లో బొద్దింక అలర్జీలు లేనివారితో పోలిస్తే, ఉన్నవారిలో అస్తమా హాస్పిటలైజేషన్ 3-4 రెట్లు ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. లక్షణాల విషయానికి వస్తే కాక్రోచ్ అలర్జీకి గురైనవారిలో దగ్గు (ముఖ్యంగా రాత్రిపూట), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ముక్కు దిబ్బడ, కళ్లు ఎర్రబడటం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు

బొద్దింకల నివారణకు ఇంటిని/కార్యాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కిచెన్, బాత్‌రూమ్‌లలో నీరు నిలువకుండా చూడాలి. పగుళ్లు, రంధ్రాలు వంటివి ఉంటే సీల్ చేయాలి. ఇంట్లో ఆహార పదార్థాలు గాలి చొరబడని డబ్బాల్లో ఉంచడం బెటర్. వారానికి ఒకసారి ఫ్లోర్, ఫర్నిచర్ కింద మాపింగ్ (Wet cleaning) చేయాలి. బెడ్ షీట్స్, కర్టన్స్ వంటివి వారానికి ఒకసారి హాట్ వాటర్‌లో వాష్ చేయాలి. అయితే పెస్ట్ కంట్రోల్ (బేయిట్స్, జెల్స్) స్ప్రేల వల్ల అలెర్జీ పెరిగే చాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువగా ఉపయోగించాలి. ఇక ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ఉబ్బసం తగ్గకపోతే, మీ ఇండ్లల్లో కాక్రోచ్ బెడద ఉండిఉంటే కాక్రోచ్ అలర్జీ టెస్ట్ (skin prick test / IgE blood test) చేయించుకోవడం బెటర్. అవసరాన్ని బట్టి డాక్టర్ల సలహాలతో అలర్జీ ఇమ్యునోథెరపీ వంటివి కూడా అలర్జీల నివారణకు ఉపయోగపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story