- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్రాంతి తీసుకోవడం మంచిది కాదా? యువతలో పెరుగుతున్న ఆందోళన!
రెస్ట్ తీసుకోవడమంటే సోమరితనం ఏమాత్రం కాదు. ఇది మెదడు సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరాన్ని కోలుకునేలా చేస్తుంది. సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

దిశ, ఫీచర్స్ : బిజీ లైఫ్‌లో రకరకాల ఒత్తిళ్లకు గురవుతుంటారు చాలా మంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే మైండ్ రీఫ్రెష్ అవుతుందని, పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ కొంతమంది జెన్ Z & మిలీనియల్స్ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారని, విశ్రాంతి తీసుకోవడం గురించి వీరిలో అపరాధ భావన కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా హస్టిల్ కల్చర్, నిరంతర ఉత్పాదకత ఒత్తిడి కారణంగా ఈ విధమైన యాంగ్జైటీస్ పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
హిస్టిల్ కల్చర్ ఎఫెక్ట్
ఆధునిక సాంకేతికత, సౌకర్యాలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు ప్రపంచంలో అధిక పని ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్‌లో ఇది కనిపిస్తున్నది. కెరీర్ లేదా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి నిరంతరం శ్రమించడం, ఎక్కువ గంటలు పనిచేయడం, విశ్రాంతి లేదా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడాన్ని ప్రోత్సహించే ఒక ఆధునిక పని విధానాన్నే హిస్టిల్ కల్చర్ అంటారు. దీనినే గ్రైండ్ కల్చర్ అని పిలుస్తారు. ఇదే జెన్ Z & మిలీనియల్స్‌లో విశ్రాంతి తీసుకోవడంపట్ల దృక్పథాన్ని మారుస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు చెబుతున్నారు.
వెనుకబడతామనే ఆలోచన..
నిరంతర ఉత్పాదకత (productivity) ఒత్తిడికి అలవాటు పడిన యువత సహజంగానే తాము రిలాక్స్ అవుతున్నప్పుడు కూడా ఆందోళన, అసౌకర్యం అనుభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా, పోటీ ప్రపంచం, ‘ఎప్పుడూ బిజీగా ఉండాలి’ అనే ఆలోచనవల్ల కూడా నెమ్మదిగా ఉండటాన్ని కొందరు జెన్‌జీలు, మిలీనియల్స్ ‘వెనుకబడటం’గా భావిస్తారు. దీని ఫలితంగా బర్నవుట్, మానసిక అలసట, ఆందోళన సమస్యలు పెరుగుతున్నాయి. దీని నుంచి బయటపడాలని, పనితోపాటు రెస్ట్ కూడా అవసరమని, ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
విశ్రాంతి ఎందుకు అవసరం?
మానసిక ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రెస్ట్ తీసుకోవడం అంటే సోమరితనం ఏమాత్రం కాదు. పైగా ఇది మెదడు ఫోకస్‌ను, సామర్థ్యాన్ని మెరుగు పరచడం, శరీరం రికవరీ చేసుకోవడం, సృజనాత్మకతను పెంపొందించడం, దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి విధులకోసం చాలా అవసరం. కంటిన్యూస్ ప్రొడక్టివిటీ స్ట్రెస్‌ను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రొడక్టివిటీ సైతం పెరుగుతుంది. దీనికి భిన్నంగా నిరంతరం రెస్టు లేకుండా పనిచేస్తే మాత్రం ఇవన్నీ నెమ్మదిస్తాయి. పైగా భావోద్వేగ అలసట, డిప్రెషన్, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. వ్యక్తులు, సమాజం బాధ్యత తీసుకోవాలని, చిన్న చిన్న విశ్రాంతి అలవాట్లు (short breaks, digital detox, Evening walk), హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






