- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : 10G ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్.. నెక్స్ట్ జనరేషన్ స్పీడ్ అదేనా?
ఒకేసారి 10Gbps ఫైబర్ బ్యాండ్ నెట్‌వర్క్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. కానీ.. ఈ నెక్ట్స్ జనరేషన్ ఇంటర్నెట్ సామర్థ్యాన్ని ఆ దేశంలోని సాంకేతిక నిపుణులు ప్రదర్శించారు.

దిశ, ఫీచర్స్ : గృహ వినియోగాల కోసం తీసుకునే ఫైబర్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ గురించి తెలిసిందే కదా.. ప్రస్తుతం గరిష్టంగా 1 Gbps లేదా కొన్ని చోట్ల 2 Gbps ప్లాన్లు వంటివి అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడున్నవాటిలో ఇవే హయ్యెస్ట్ స్పీడ్.. కానీ ఒకేసారి 10Gbps ఫైబర్ బ్యాండ్ నెట్‌వర్క్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో అయితే లేదు. కాకపోతే ఇటీవల చైనాలోని షియాంగ్‌ఆన్(Xiong’an) నగరంలోని ఒక సాధారణ ఇంట్లో ఈ నెక్ట్స్ జనరేషన్ ఇంటర్నెట్ సామర్థ్యాన్ని అక్కడి సాంకేతిక నిపుణులు ప్రదర్శించారు. ఈ నెట్వర్క్‌లో 9.8 Gbps డౌన్‌లోడ్ స్పీడ్ సాధించారు. అప్‌లోడ్ స్పీడ్ కూడా 1 Gbps వరకు చేరుకోగా, లేటెన్సీ మాత్రం అద్భుతంగా 3 మిల్లీసెకన్లు మాత్రమే ఉంది. నిజానికి ఇది ఇంటి వాతావరణంలో చాలా వేగవంతమైన స్పీడ్‌తో పాటు అతి తక్కువ ఆలస్యాన్ని అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
10Gbps ఫైబర్ బ్యాండ్ నెట్‌వర్క్ ప్రయోగం 5Gకి అప్‌గ్రేడ్ గానీ లేదా వైర్‌లెస్ టెక్నాలజీ కానీ కాదు. కాకపోతే ఇది ఫిక్స్‌డ్ లైన్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాడుతున్న బఫరింగ్, లాగ్ ఆలస్యం వంటి సమస్యలను పూర్తిగా తొలగించే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఈ స్థాయి స్పీడ్‌తో క్లౌడ్ కంప్యూటింగ్, స్థానిక కంప్యూటర్ లాగా అనిపిస్తుంది. వెరీ హై రిజల్యూషన్ వీడియో స్ట్రీమింగ్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తుంది. ఏఐ టూల్స్, రియల్-టైమ్ అప్లికేషన్లు, ఇమ్మర్సివ్ ఎన్విరాన్‌మెంట్స్ (వర్చువల్ రియాలిటీ) వంటివి కూడా ఆటంకం లేకుండా, ఆలస్యం లేకుండా పనిచేస్తాయి. కాబట్టి ఈ సరికొత్త ప్రయోగం భవిష్యత్ డిజిటల్ జీవితానికి ఒక గొప్ప మైలు రాయివంటిదని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






