- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Diabetes : డయాబెటిస్ ఎల్లప్పుడూ ఊరికే రాదు..!వచ్చేముందు శరీరంలో జరిగే మార్పులివే..
Diabetes : డయాబెటిస్ ఎల్లప్పుడూ ఊరికే రాదు..! వచ్చేముందు శరీరంలో జరిగే మార్పులివే..

దిశ, ఫీచర్స్ : ఇటీవల చాపకింద నీరులా విస్తరిస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రధానంగా ఉంటోంది. ఒక్కసారి వచ్చిందంటే అది పూర్తిగా తగ్గదు. కాకపోతే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ప్రమాదకరంగా మారకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి ఇతర అనారోగ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి రాకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ప్రారంభంలోనే అంటే ప్రీ డయాబెటిస్ దశలోనే దాని లక్షణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం ద్వారా తలెత్తే ఇతర సమస్యలను నివారించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ లక్షణాలేమిటి? ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*తరచుగా దాహం, మూత్ర విసర్జన : తరచుగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ప్రీడయాబెటిస్ దశ ప్రారంభమైనట్లు అనుమానించాల్సిందే. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంవల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా తొలగిస్తుంది. కాబట్టి తరచుగా దాహం వేయడం, యూరిన్‌కు వెళ్లాల్సి రావడం జరుగుతుంది.
* అలసట, బలహీనత : శరీర కణాలకు గ్లూకోజ్ సరిగ్గా చేరకపోవడం వల్ల అలసట, బలహీనత ఏర్పడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే గనుక వెంటనే షుగర్ టెస్టు చేయించుకోవాలి. ప్రీ డయాబెటిస్ దశలోనే కేర్ తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది.
* అకారణంగా బరువు తగ్గడం : బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అది వ్యాయామాలు చేయడం ద్వారానో, మీ ప్రయత్నం ద్వారానో జరిగినప్పుడు మాత్రమే. అలా కాకుండా అకస్మాత్తుగా కొన్నిరోజుల్లోనే బరువు తగ్గితే అనుమానించాల్సిందే. ఎందుకంటే శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించలేకపోతే, కొవ్వును, అలాగే కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది దీనివల్ల బరువు తగ్గుతారు.
* ఆకలి పెరగడం: శరీరం తగిన శక్తిని పొందలేనప్పుడు ఆకలి వేస్తుంది. అయితే తరచుగా అధిక ఆకలి వేస్తుంటే గనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే మీ శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించలేకపోవడంవల్ల కూడా ఇలా జరుగుతుంది. అంటే డయాబెటిస్ డెవలప్ అవుతున్నదని అర్థం. దీంతోపాటు తరచుగా చర్మం పొడిబారడం, దురద లేదా గాయాలు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసకబారడం వంటివి రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడంవల్ల జరుగుతుంటాయి. అంటే డయాబెటిస్ కావచ్చు.
*జలదరింపు : కాళ్లు, చేతుల్లో జలదరింపు, యూరినటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా సంభవిస్తుంటే కూడా ప్రీ డయాబెటిస్, లేదా డయాబెటిస్ లక్షణాలుగా అనుమానించాలి అంటున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా డయాబెటిస్ డెవలప్ కావచ్చు. కాబట్టి వయసును బట్టి టెస్టులు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం, తరచుగా వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






