Food combinations : వీటిని కలిపి తింటున్నారా..? అయితే ఎన్నటికీ బరువు తగ్గలేరు!

by Javid Pasha |

Food combinations : వీటిని కలిపి తింటున్నారా..? అయితే ఎన్నటికీ బరువు తగ్గలేరు!

Food combinations : వీటిని కలిపి తింటున్నారా..? అయితే ఎన్నటికీ బరువు తగ్గలేరు!
X

దిశ, ఫీచర్స్ : ఊబకాయం, అధిక కొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అధిక బరువు తగ్గాలని ఆలోచిస్తు్న్నారా? అయితే మీరు అనుసరించాల్సినవే కాదు, అనుసరించకూడని ఫుడ్ కాంబినేషన్స్ గురించి కూడా తెలుసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని పదార్థాలు బరువు పెరగడానికి కారణం అవుతుంటాయి. అవేంటో చూద్దాం.

ఆలు గడ్డలు, అన్నం

ఆలుగడ్డలు (బంగాళ దుంప) ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిలో స్టార్చ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటితో చేసిన కూరను గానీ, ఇతర పదార్థాలను గానీ తరచుగా అన్నంతో కలిపి తినడంవల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తీసుకోకండి. అప్పుడప్పుడూ తీసుకున్నా తక్కువ మోతాదులో తినండి అంటున్నారు ఆహార నిపుణులు.

డ్రై ఫ్రూట్స్, ప్రొటీన్స్

ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కొందరు ఓట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కలిపి తింటుంటారు. ఇలా చేస్తే అధిక బరువు తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిలో అధిక చక్కెర స్థాయిలు ఉంటాయి, అధిక కొవ్వులు ఉంటాయి. అందుకే ఈ తరహా ఫుడ్ కాంబినేషన్‌కు దూరంగా ఉండటం బెటర్.

చిరుతిళ్లు, కార్బొనేటెడ్ డ్రింక్స్

కొందరికి ఉదయమో, సాయంత్రమో ఏదో ఒక వెరైటీ స్నాక్ తిని, శీతల పానీయాల(Carbonated drinks)ను తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్ ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఫ్యాట్స్, అధిక చక్కెరస్థాయిలు జీర్ణ సమస్యలను పెంచుతాయి. అంతేకాకుండా అధిక బరువు తగ్గకుండా నిరోధిస్తాయి.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story