- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో స్కామర్స్.. అలర్ట్‌గా ఉండకపోతే అంతే ఇక !
సోషల్ మీడియాలో స్కామర్స్.. అలర్ట్‌గా ఉండకపోతే అంతే ఇక !

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ దాడుల అవకాశాలు కూడా పెరిగాయి. సోషల్ మీడియాలో స్కామర్స్ అనుమానాస్పద ఫిషింగ్ లింకులు, బాట్లు, నకిలీ ఖాతాలు (ఇంపర్సనేషన్) వాడుతూ నమ్మదగిన సంస్థల రూపంలో నటించి వ్యక్తిగత సమాచారం, యూజర్ లాగిన్ వివరాలను దొంగిలిస్తున్నారు. ఈ స్కామ్‌లపై అవగాహన లేకపోవడం వలన చాలామంది వినియోగదారులు నకిలీ సోషల్ మీడియాగ్రూపులు, ఫిషింగ్ చాట్‌బాట్లు, క్రిప్టో స్కామ్‌లు వంటివి లక్ష్యంగా మారుతున్నారు. ఇటువంటి మోసాలకు బలికాకుండా ఉండేందుకు, ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన శిక్షణ సెక్యూరిటీ అవేరేనేస్ ట్రైనింగ్ కల్పించాల్సిన అవసరం ఉంది.
మోసాలు ఇలా..
* ఫిషింగ్ లింకులు : నకిలీ వెబ్‌సైట్లకు లింకులు పంపి లాగిన్ వివరాలు దొంగలించడం
*టాస్క్-బేస్డ్ జాబ్ స్కామ్‌లు : చిన్న పని చేస్తే డబ్బు వస్తుందనే మాయలో ఉంచడం..
*క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ మోసం : నకిలీ వాగ్దానాలతో క్రిప్టోలో పెట్టుబడి పెట్టిస్తారు
*నకిలీ చాట్ బాట్లు : వ్యక్తిగత సమాచారం పొందేందుకు ఇంటలిజెంట్ బాట్లు
*ఇంపర్సనేషన్ అకౌంట్లు : నమ్మకమైన సంస్థల పేరుతో నకిలీ ఖాతాలు
*డార్క్ వెబ్ లింకులు : మీ పర్సనల్ డేటాను వెబ్ ద్వారా అమ్మేస్తారు
గుర్తించడం ఎలా?
* అసాధారణంగా డబ్బు ఇచ్చే వాగ్దానాలు చేస్తే అప్రమత్తంగా ఉండాలి
* తెలియని లింకులు లేదా డౌన్‌లోడ్‌లపై క్లిక్ చేయవద్దు
* మీకు తెలిసిన వారి పేరుతో వచ్చిన ఖాతా అయినా, రెండోసారి ధ్రువీకరించాలి
* గ్రూపుల్లో లేదా చాట్లలో బ్యాంక్ డిటెయిల్స్ అడిగితే ఎప్పుడూ నో చెప్పండి..
* ఖాతాలో ‘తక్షణమే రిజిస్టర్ అవ్వండి’ అనే పీల్ ఉన్నా, ఆఫర్ వెనకున్న ఉద్దేశ్యాన్ని సందేహించండి
ముఖ్యమైన సూచనలు
* తెలియని వ్యక్తుల మెసేజ్‌లను జాగ్రత్తగా చూడండి
* అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు
* వాస్తవికంగా అనిపించని ఆఫర్లపై నమ్మకం పెట్టకండి
* సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
*సిస్టమ్‌లో యాంటీ వైరస్ లేదా స్పామ్ ఫిల్టర్ తప్పనిసరిగా వాడండి
* చాట్ బాట్ల ద్వారా వచ్చే అడ్వాన్స్‌డ్ టాస్క్‌లు ఎప్పుడూ స్కామ్ కావొచ్చు
* క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో వచ్చే లింకులకు దూరంగా ఉండండి
* సైబర్ మోసాన్ని గుర్తిస్తే వెంటనే 1930కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి
- రాము అడబాల






