- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI Emergency : కొత్త జాతిగా ఎదుగుతున్న ఏఐ.. మానవ వినాశనం తథ్యం.. ఇదే ఉదాహరణ..
ఎక్స్ గూగుల్ ఆఫీసర్ మో గవ్డాట్ కృత్రిమ మేధస్సు (AI) గురించి ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ మార్పు కంటే పెద్ద విపత్తుగా పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎక్స్ గూగుల్ ఆఫీసర్ మో గవ్డాట్ కృత్రిమ మేధస్సు (AI) గురించి ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ మార్పు కంటే పెద్ద విపత్తుగా పేర్కొన్నారు. రాబోయే పన్నెండేళ్లలో ఏఐ మానవులను కంట్రోల్ చేస్తుందని.. తనకు పూర్తిగా సరెండర్ అయిపోయే చాన్స్ ఉందని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన మూడు భయానక పరిస్థితుల గురించి వివరించారు.
1. యంత్రాల నుంచి దాక్కుంటాం
ఏఐ టెక్నాలజీలో మార్పులతో 2037 నాటికి మానవులు యంత్రాల నుంచి దాక్కునే పరిస్థితి వస్తుందన్నారు ఎక్స్ గూగుల్ ఆఫీసర్. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని.. ఫ్యూచర్‌లో ఇదే జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఈ పరిస్థితి 2055 వరకు వస్తుందని చెప్పేవాడని కానీ.. 2037 వరకు మనం పూర్తిగా ఏఐ కంట్రోల్‌కు వెళ్తామని భావిస్తున్నట్లు తెలిపారు. భూమిపై అత్యంత తెలివైన జీవి మానవుడు కాకుండా లేని పరిస్థితిని ఊహించడం కష్టంగా ఉందన్నారు.
AI వేగవంతమైన అభివృద్ధి వివిధ రంగాలలో భారీ ఉద్యోగ నష్టాలకు దారితీస్తుంది. ఆటోమేషన్, అధునాతన AI సాంకేతికతలు మానవ కార్మికులను భర్తీ చేస్తాయి. సామాజిక-ఆర్థిక అస్థిరతను కలిగిస్తాయి. ఈ ధోరణి వచ్చే దశాబ్దంలో మరింత తీవ్రమవుతుందని.. ప్రభుత్వాలు ఈ సవాలును ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
2. నియంత్రణ
ఒక్కసారి ఏఐ మనకంటే తెలివైనది అయితే మానవ నియంత్రణ పోతుందన్నారు మో గవ్డాట్. మనం తిరిగిరాని పాయింట్స్ నుంచి నెలల దూరంలో మాత్రమే ఉన్నామని.. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే.. పాజ్ బటన్ లేదు.. కంట్రోలింగ్ లేదు.. స్విచ్ ఆఫ్ కూడా లేదన్నారు. ఏఐ నిరంతరం ఏజెంట్లను ఉత్పత్తి చేస్తూ.. చాలా త్వరగా తెలివిగా మారవచ్చని హెచ్చరించారు. తగిన నియంత్రణ లేకపోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చని గవ్డాట్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే AI కంపెనీలపై 98% పన్ను విధించాలని ప్రతిపాదించారు. దీనివల్ల అభివృద్ధి వేగం తగ్గి, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నియంత్రణ లేకపోతే.. AI వ్యవస్థలు నియంత్రణ లేకుండా మారి, ఊహించని ప్రమాదాలను సృష్టించవచ్చు.
3. కొత్త జాతిగా ఎదుగుదల
ఏఐ కొన్ని నెలల్లో ఐన్‌స్టీన్ కంటే పది రెట్లు తెలివైనదిగా మారుతుందన్నారు గవ్డాట్. జిపిటి-4 ఇప్పటికే 155 ఐక్యూ కలిగి ఉందని.. తదుపరి వెర్షన్ 1,600కి చేరవచ్చని.. అది తెలివి కాదు.. గుర్తించలేని స్థాయని హెచ్చరించారు. అంత తెలివైన జీవి దాదాపు ఒక కొత్త జాతిలా ఉంటుంది. గ్రహంపై తీవ్రమైన ప్రభావం చూపగలదన్నారు.






