డిగ్రీలేదని ఆగిపోలే.. ప్రపంచ బిలియనీర్లలో 30% వాళ్లే..!!

by Javid Pasha |

ప్రపంచంలోని బిలియనీర్లలో సుమారు 30% మందికి కాలేజీ డిగ్రీల్లేవు. 12-16% మందికి స్కూల్స్ లేదా కాలేజీ డ్రాపౌట్లు ఉన్నాయి.

డిగ్రీలేదని ఆగిపోలే.. ప్రపంచ బిలియనీర్లలో 30% వాళ్లే..!!
X

దిశ, ఫీచర్స్ : ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే.. బస్సులో వెళ్లొచ్చు.. కారులో వెళ్లొచ్చు.. బైకుమీద వెళ్లొచ్చు.. అయితే అవన్నీ అందుబాటులో లేవనుకోండి..! అప్పుడేం చేస్తారు? కొందరైతే ఆగిపోతుంటారు.. కానీ అందరూ అట్లనే చేయరుగా జర డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఇక సంకల్ప బలమున్నవారు, లక్ష్యం చేరుకోవాలన్న ఆసక్తి, అవసరం ఉన్నవారు మరో అడుగు ముందుకేస్తారు. ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. రోజుల తరబడి నడుచుకుంటూ అయినా సరే గమ్యం చేరుతారు. అలాగే తమకు పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు లేవని ఆగిపోలేదు కొందరు. పైగా అవన్నీ ఉన్నవారికంటే ఉన్నతస్థాయిలో నిలిచారు. బిలియనీర్లుగా ఎదిగారు. సంకల్పముంటే చాలు.. డిగ్రీలు లేకున్నా అనుకున్నది సాధించవచ్చునని నిరూపించారు. ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చారు. ప్రేరణగా నిలిచారు. అలాంటి కొంతమంది బిలియనీర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు తెలుసా? Wealth-X's Billionaire Census (2016), అలాగే 2023-24 ఫోర్బ్స్ రిపోర్టుల ప్రకారం.. ప్రపంచంలోని బిలియనీర్లలో సుమారు 30% మందికి కాలేజీ డిగ్రీల్లేవు. 12-16% మందికి స్కూల్స్ లేదా కాలేజీ డ్రాపౌట్లు ఉన్నాయి. డిగ్రీ లేకుంటే ఏదీ సాధించలేమని, సక్సెస్ రాదని అనుకోవడం సరికాదు. లేకపోయినా సక్సెస్ సాధించిన వ్యక్తులకు సంబంధించిన ఉదాహరణలు భారత దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులంతా పరిస్థితులను, సమస్యలను, సమాచాన్ని చదివి తమను తాము తీర్చి దిద్దుకున్నారు. అలాంటి వారిలో ఫేస్ బుక్ (మెటా) వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఇంకెంతోమంది ఉన్నారు.

స్టీవ్ జాబ్స్

ప్రతీ ఒక్కరికి చదువు చాలా ముఖ్యం. అదొక ఉపాధి, ఉద్యోగ మార్గం. అందుకే తప్పక చదువుకోవాలి. కానీ అది లేనంత మాత్రానా జీవితంలో ఆగిపోవద్దని నిరూపించారు యాపిల్ కంపెనీ కో ఫౌండర్ (Co-Founder) స్టీవ్ జాబ్స్ (Steven Paul Jobs), కృషి, పట్టుదల, ధైర్యం ఉంటే ఎవరైనా బిలియనీర్‌గా మారవచ్చునని చాటి చెప్పారు. 1972లో రీడ్ కాలేజీలో కేవలం 6 నెలలు చదివి మధ్యలోనే చదువు ఆపేశారు. డ్రాప్‌ఔట్ అయినప్పటికీ, కాలిగ్రాఫీ కోర్సులు(Calligraphy courses) చేసి యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్‌‌తో ప్రేరణ పొందారు. ఫలితంగా యాపిల్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన, ముఖ్యమైన కంపెనీలలో ఒకటిగా మారింది. జాబ్స్ మరణించేవరకు అతని నెట్‌వర్త్ 10 బిలియన్ డార్లరకు పైగానే ఉంది.

మార్క్ జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ (మెటా) వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ 2004లో డ్రాపౌడ్ అయ్యారు. అతను డార్మ్ రూమ్‌లో, అంటే.. క్యాంపస్‌ హాస్టల్లోని ఒక రూములో ఉంటూ ఫేస్‌బుక్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడది ప్రపంచంలోని బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ముందున్నది. 2024 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. జుకర్‌బర్గ్ నెట్‌వర్త్ 177 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. అంటే చదువు పూర్తి కాలేదని, డిగ్రీ లేదని ఆలోచిస్తూ కూర్చుంటే.. ప్రయత్నం చేయకుంటే.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన బిలియనీర్‌గా ఉండేవారా?

బిల్ గేట్స్ - ఇంకెందరో..

మైక్రోసాఫ్ట్ కో షౌండర్ బిల్ గేట్స్‌ పెద్దగా చదువుకోలేదు. డిగ్రీ లేదు. హార్వర్డ్‌లో 1975లో డ్రాప్‌ఔట్ అయ్యాకె, అయితేనేం ఆయన ప్రోగ్రామింగ్‌పై ఫోకస్ చేసి, ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్మించారు. 2024 నాటికి గేట్స్ నెట్‌వర్త్ 130 బిలియన్ డాలర్లు. మరో బిలియనీర్, వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా తన 16 ఏండ్ల వయసులో స్కూల్ చదువును మధ్యలోనే వదిలేశారు. డిస్‌లెక్సియా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుంటూ వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్, మ్యూజిక్ లేబుల్స్ వంటి 400+ కంపెనీలను నడిపారు. ఆయన నెట్‌వర్త్ 3.9 బిలియన్ డాలర్లు. ఇప్పుడు చెప్పండి డిగ్రీ లేకుంటే సంపాదించడం రాదా? గ్విన్ షాట్‌వెల్ (Gwynne Shotwell) అనే మహిళ కూడా కాలేజీ డిగ్రీ లేకున్నా టెస్లా/స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీల ద్వారా 30 బిలియన్+ డాలర్లు సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.

ఇదీ సంగతి..

హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యమే. కాలేజీ డిగ్రీలు అవసరమే. కానీ అవి లేనివారు మాత్రం తమకు చదువు లేదని ఎక్కడా ఆగిపోకూడదనే ప్రేరణను అందించారు ఎంతోమంది బిలియనీర్లు. కృషి, పట్టుదల, ఆసక్తి, ధైర్యం, లక్ష్యం, నిరంతర శ్రమ ఉంటే అది సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఇవన్నీ ఉంటే అవకాశాలు ఎక్కడో ఒక దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాయి. అలాంటి పరిస్థితులు లేకపోతే గనుక మీరే అవకాశాలను క్రియేట్ చేయవచ్చు అంటారు నిపుణులు. జుకర్ బర్గ్ నుంచి బిల్ గేట్స్ వరకు అనేకమంది బిలియనీర్లు అదే చేశారు. శ్రమ ఎప్పటికైనా ఫలితాన్నిస్తుంది.

Next Story