- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Emotional bonding : బంధాలను బలోపేతం చేసే టెక్నిక్ ఇదిగో!

దిశ, ఫీచర్స్ : రిలేషన్ షిప్‌లోకి అడుగు పెట్టాక లైఫ్ జర్నీ హ్యాపీగా సాగాలంటే లవ్ అండ్ రొమాన్స్ మాత్రమే కాదు, కపుల్స్ మధ్య అనేక విషయాలు కీ రోల్ పోషిస్తాయని ఫ్యామిలీ కౌన్సెలింగ్ అండ్ రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు. ఒకరి గురించి మరొకరు కేర్ తీసుకోవడం, కుటుంబం, బాధ్యతల విషయంలో కలిసి మాట్లాడుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, పరస్పరం అర్థం చేసుకోవడం, ఆర్థిక వ్యవహారాలు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. వీటితో పాటు బంధం పదిలంగా ఉండేందుకు ఇంకా ఏయే విషయాలు సహాయపడతాయో చూద్దాం.
ఎమోషనల్ బాండింగ్
భార్య భర్తల బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ఎమోషనల్ బాండింగ్ చాలా ముఖ్యం. ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో ప్రేమను వ్యక్త పరచడం, అప్పుడప్పుడు సర్ ప్రైజ్‌లు ఇవ్వడం, పరస్పరం కేర్ చూపించడం, రొమాన్స్‌లో ఇరువైపులా సరైన రెస్పాన్స్ వంటివి ఎమోషనల్ బాండింగ్‌ను మరింత బలోపేతం చేస్తాయి. దీంతోపాటు కలిసి సినిమాలకు, రెస్టారెంట్లకు వెళ్లడం, ఏకాంతంగా గడిపేందుకు, మనసులో విషయాలను షేర్ చేసుకునేందుకు సమయం కేటాయించడం బంధాన్ని బలోపేతం చేస్తాయి.
పరస్పర నమ్మకం
బంధంలో అతి ముఖ్యమైనది నమ్మకం. ఇది ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు ఎదురైనా వివాదాలు, విడాకులు వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. భాగస్వామిపై అన్ని సందర్భాల్లోనూ చూపించే ప్రేమ నమ్మకాన్ని పెంచుతుంది. భార్యా భర్తలు తమ తమ పనుల్లో, బాధ్యతల్లో సహకరించుకోవడం, నిర్వహణల విషయంలో ప్రశంసలు వంటివి మరింత మేలు చేస్తాయి. ఆయా సందర్భాల్లో కాంప్లిమెంట్స్ అనేవి అవతలి వ్యక్తిని స్పెషల్ పర్సన్‌లా గుర్తిస్తున్నారని భావిస్తారు. ఇద్దరిలోనూ ఇది కొనసాగితే పరస్పర గౌరవం, నమ్మకం పెరిగి బంధం మరింత బలంగా మారుతుంది.
రొటీన్‌కు భిన్నంగా..
బంధంలో ఎగ్జైట్‌మెంట్ ఉండేలా చూసుకోవడం ఒత్తిడిని దూరం చేస్తుంది. ముఖ్యంగా రొమాన్స్ విషయంలో ఎగ్జైట్‌మెంట్ బంధాన్ని మరింత స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. రొమాంటిక్ మూమెంట్స్ ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించడంవల్ల హ్యాపీనెస్‌ను పెంచుతాయి. అలాగే కష్ట కాలాల్లో ఒకరికి ఒకరు భరోసా ఇవ్వడం, బాధలో ఉన్నప్పుడు భాగస్వామి నుదుటిపై ముద్దు పెట్టడం, హగ్ చేసుకోవడం, తానున్నానని భరోసా ఇవ్వడం సంబంధాలను బలోపేతం చేసే అద్భుతమైన టెక్నిక్స్ అంటున్నారు నిపుణులు.
Read More...
Happiness : బిజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్.. రోజూ ఇలా చేస్తే చాలు!






