- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూత్రంతో విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ.. రైతులకు ఖర్చు తగ్గించే కొత్త పద్ధతి..!
యూరినరీ సిస్టమ్ రూపకల్పన ద్వారా ఎరువుల కొరత, పరిమిత విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయానికి సమర్థవంతమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవచ్చు.

దిశ, ఫీచర్స్ : మానవ మూత్రం ఒక విసర్జిత వ్యర్థ పదార్థం.. కానీ దీనితో భవిష్యత్‌లో అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉందంటున్నారు కొందరు పరిశోధకులు. ముఖ్యంగా సౌర శక్తితో పనిచేసే యూరినరీ సిస్టమ్(urinary system) రూపకల్పన ద్వారా ఎరువుల కొరత, పరిమిత విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయానికి సమర్థవంతమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడైతే అలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు కానీ.. ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రయోగాలు ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. కాబట్టి సోలార్ శక్తితో యూరిన్‌ను విద్యుత్ ఉత్పత్తి వనరుగా, ఎరువులుగా మార్చగలిగే రోజులు ఇంకెంతో దూరం లేకపోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ ఏడాది (2025) స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియం తర్పే (William Tharpe) నేతృత్వంలోని పరిశోధక బృందం, సౌర శక్తితో నడిచే ఎలక్ట్రోకెమికల్ స్ట్రిప్పింగ్ (Solar-ECS) సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఇది మూత్రం నుంచి అమ్మోనియం సల్ఫేట్ ఎరువును తయారు చేస్తుంది. అంతేకాకుండా అదనపు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో ‘ఓసారి కూంబ్స్’ అనే పీహెచ్‌డీ స్టూడెంట్ కీ రోల్ పోషించింది. అయితే ఈ ప్రయోగం సోలార్ శక్తితో మూత్రాన్ని ఎరువుగా, విద్యుత్ ఉత్పత్తి వనరుగా మార్చుకునే విషయమై ఆశలు రేకెత్తించడంతోపాటు పలువురు పరిశోధకులు దానిపై దృష్టి కేంద్రీకరించేలా చేసింది. అలాగే ‘Robial's Pea Power technology’ కూడా యూరిన్‌ను సోలార్ పవర్‌తో కలిపి ఎరువుగా మార్చుకునే సాంకేతికతను డెవలప్ చేసి, ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది. అంటే ఇంకా వాణిజ్యీకరణ దశలో ఉంది. కానీ మార్కెట్‌లో అందుబాటులో లేదు.
మూత్రం మానవ వ్యర్థ పదార్థమే కానీ.. అందులో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి పంటల పెరుగుదలకు అవసరం. కాబట్టి సౌర శక్తిని ఉపయోగించి మూత్రాన్ని శక్తి వనరుగు, ఎరువుగా మార్చగలిగితే, రసాయన ఎరువులపై ఆధారపడకుండా రైతులకు మేలు జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అదనంగా సోలార్ పవర్డ్ యూరిన్ సిస్టమ్ (solar-powered urine system) ప్రాసెస్‌లో ఉత్పన్నమయ్యే బై ప్రొడక్ట్స్‌ను బయోగ్యాస్‌గా, ఇతర శక్తి వనరులుగానూ మార్చవచ్చునని చెబుతున్నారు. ఇది స్థానిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని భావిస్తు్న్నారు. అంతేకాకుండా సౌర శక్తితో పనిచేసే యూరిన్ వ్యవస్థ అనే కొత్త సాంకేతికత పర్యావరణ అనుకూలమైనదిగానూ ఉంటుంది. ఇది విద్యుత్ సరఫరా పరిమితంగా ఉన్న లేదా అసలుకే లేని గ్రామీణ, అటవీ ప్రాంతాలకు ఎంతో మేలు చేస్తుంది. ఆ కల సాకారం అయ్యే రోజులు మరెంతో దూరం లేవిక అంటున్నారు శాస్త్రవేత్తలు. Link






