- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
papaya : ఇమ్యూనిటీ బూస్టర్.. చలికాలంలో ఔషధంలా పనిచేస్తున్న బొప్పాయి!

దిశ, ఫీచర్స్ : చలికాలంలో మిగతా సీజన్లకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. చలి గాలులు వీయడంవల్ల జలుబు, గొంతునొప్పి, కండరాలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సీజన్ వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. ముఖ్యంగా దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటివి వ్యాపించే చాన్స్ కూడా ఉంటుంది. అయితే ఏ రోగాలైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే దాడిచేస్తుంటాయి. అందుకే సీజనల్ వ్యాధులతో పోరాడాలంటే తగిన ఇమ్యూనిటీ పవర్ అవసరం. బొప్పాయిని ఆహారంగా తీసుకోవడంవల్ల అది పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు బొప్పాయిలో విటమిన్ ఎ, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. పండులోనే కాకుండా కాయలో, ఆకుల్లో కూడా ఉంటాయి. చల్లటి వాతావరణంలో తినడంవల్ల బాడీని వెచ్చగా ఉంచడంలో బొప్పాయి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ పేషెంట్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను, యాసిడ్ రిఫ్లె్క్స్‌ను నివారిస్తుంది. ఎసిడిటీని, కడుపులో ఉబ్బరాన్ని, అజీర్తిని తగ్గించడంలో బొప్పాయి సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల అధిక బరువను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. డెంగ్యూ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే పడిపోయిన ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Health : ఈ టైమ్‌లోగా తినకపోతే రిస్క్‌లో పడ్డట్లే.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు!






