ఈ పండ్లను కలిపి తింటే తిరుగు లేదిక.. ఎనర్జీతోపాటు ఆ బెనిఫిట్స్ కూడా..!

by Javid Pasha |

బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

ఈ పండ్లను కలిపి తింటే తిరుగు లేదిక.. ఎనర్జీతోపాటు ఆ బెనిఫిట్స్ కూడా..!
X

దిశ, ఫీచర్స్ : మనం ఏదైనా పనిని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆరోగ్యంతోపాటు అందుకు అవసరమైన ఎనర్జీ చాలా ముఖ్యం. అయితే అందుకోసం అధిక శ్రమ చేయాల్సిన సందర్భాల్లో కొందరు సప్లిమెంట్స్ వాడటమో, ఎనర్జీ డ్రింక్స్ తాగడమో చేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. బదులుగా సహజమైన శక్తి సామర్థ్యాలు పొందాలంటే తాజా పండ్లను తీసుకోవాలి. అయితే కొన్ని రకాల పండ్లను కలిపి తినడంవల్ల తక్షణ శక్తితోపాటు మానసిక ఉత్తేజాన్ని, పనిలో మెరుగుదలను పెంచుతాయని హార్వర్డ్ హెల్త్ అండ్ పబ్‌మెడ్ సెంట్రల్ (Harvard Health and PubMed Central) పరిశోధనలు పేర్కొంటున్నాయి. అవేమిటో చూద్దాం.

బ్లూబెర్రీలు + ఆపిల్

బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇక యాపిల్స్‌లో విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల శరీరానికి, మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. వీటిని కలిపి ఒకేసారి తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. అంతేకాకుండా ఈ ఫ్రూట్స్ కాంబో బ్రెయిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతి రోజూ యాపిల్, బ్లూ బెర్రీలను ఉదయంపూట స్నాక్‌గా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పరిశోధనల ప్రకారం బ్లూబెర్రీలు మెదడు ఫంక్షన్‌ను 20% వరకు మెరుగుపరుస్తాయి

బనానా + ఆరెంజ్

బనానాలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల మెదడుకు తక్షణ శక్తి అందుతుంది. మూడ్ అండ్ ఫోకస్‌ను మెరుగుపరుస్తుంది. ఇక ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను రక్షిస్తుంది. న్యూరోట్రాన్స్‌మిటర్ ఫంక్షన్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రెండు పండ్లను కలిపి తినడంవల్ల శరీరానికి స్థిరమైన ఎనర్జీని ఇస్తాయి. ఒత్తిడి నుంచి రిలీఫ్ అందిస్తాయి. ఇక ఎలా తినాలనే విషయానికి వస్తే అరటి పండును, ఆరెంజ్ సెగ్మెంట్‌తో కలిపి స్మూతీ చేసి ఉపయోగించవచ్చు లేదా స్నాక్‌గా తినవచ్చు. దీనివల్ల రోజువారీ పనితీరులో 15-20% మెరుగుదల కనిపిస్తుందని అధ్యనాలు చెబుతున్నాయి.

స్ట్రాబెర్రీలు + కివి

స్ట్రాబెర్రీలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్(ఆంథోసైనిన్స్)తో కూడి ఉంటాయి. కాబట్టి ఇవి మెదడు ఇన్‌ఫ్లమేషన్‌(నొప్పి లేదా మంట)ను తగ్గించి, మెమరీని షార్ప్ చేస్తాయి. ఇక కివి ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి. ఈ రెండు పండ్లను కలిపి తినడంవల్ల మెదడు ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఫిజికల్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీలు, కివిని కట్ చేసి, యోగర్ట్‌తో కలిపి తినవచ్చు. దీనివల్ల మెంటల్ ఫాటిగ్ తగ్గుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగవుతుంది.

బ్లాక్‌బెర్రీలు + దానిమ్మ

బ్లాక్‌బెర్రీలు విటమిన్ కె, అలాగే ఫైబర్‌తో మోటార్ పెర్ఫార్మెన్స్ అండ్ వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ఇక దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి మెదడుకు ఆక్సిజన్ సప్లైని పెంచి, శక్తిని పెంచుతాయి. ఈ రెండు ఫ్రూట్స్‌ను కలిపి తినడమనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ఎలా తినాలనే విషయానికి వస్తే బ్లాక్‌బెర్రీలు, దానిమ్మ గింజలను కలిపి సలాడ్‌గా లేదా జ్యూస్‌గా చేయడం ద్వారా ఉపయోగించవచ్చు. దీనివల్ల ఫిజికల్ ఎనర్జీతోపాటు మెంటల్ పెర్ఫార్మెన్స్ పెరుగుతాయి. Link

Next Story