- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రకు ముందు ఈ ఆహారాలు తింటున్నారా? భయంకరమైన కలలు వస్తాయ్ జాగ్రత్త!
సాధారణంగా నిద్రకు ముందు పాలు, చీజ్, ఐస్ క్రీమ్, స్వీట్స్, స్పైసీ ఫుడ్స్ తిన్నవారిలో భయంకరమైన కలలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

దిశ, ఫీచర్స్ : నిద్రకు ముందు తినే ఆహారాలు ఆరోగ్యాన్నే కాదు, రాత్రిళ్లు వచ్చే కలలను సైతం ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? మెంట్రియల్ యూనివర్సిటీ (Université de Montréal) నుంచి వచ్చిన ఒక అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. స్టడీలో భాగంగా నిద్రకు ముందు 400 మందికి సంబంధించిన ఆహారపు అలవాట్లను పరిశోధకులు విశ్లేషించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం
*సాధారణంగా నిద్రకు ముందు పాలు, చీజ్, ఐస్ క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు, స్వీట్స్, అలాగే గార్లిక్, చిల్లీ వంటి స్పైసీ ఫుడ్స్ తిన్నవారిలో భయంకరమైన కలలు (Nightmares) వంటివి సాధారణంగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇదేదో కేవలం మాయమాటలు కాదని, బయాలజీ ఆధారితమైన సమాచారమని కూడా వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఆహారాలు జీర్ణక్రియలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, యాసిడిటీ లేదా ఇతర సమస్యలు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఇది నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్( REM )సైకిల్‌ను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి భయంకరమైన కలలకు చాన్స్ ఉంటుంది.
*అత్యంత గాఢమైన నిద్ర దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్( REM )గా పేర్కొంటారు. ఈ స్టేజ్‌లో మెదడు చురుకుగా ఉండి, భావోద్వేగాలు, జ్ఞాపకాలు ప్రాసెస్ అవుతాయి. కానీ జీర్ణ సమస్యలు దీనిని అడ్డుకుంటాయి. అందుకే భయంకరమైన కలలు, సానుకూల కలలు వంటివి వస్తుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు చాక్లెట్ లేదా స్పైసీ ఫుడ్ తిన్నవారిలో 30% మంది అనీజీగా లేదా అస్వస్థతగా(Slept unwell) నిద్రపోయినట్లు, మరోవైపు పండ్లు, కూరగాయలు వంటివి తిన్నవారు లోతైన, శాంతియుతమైన నిద్రను అనుభవించినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
*రెండవ రకమైన పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు జీర్ణాన్ని సులువు చేసి, మెలటోనిన్ (నిద్ర హార్మోన్) స్థాయిలను పెంచుతాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా కలలు సానుకూలంగా లేదా సాధారణంగా ఉంటాయి. అందుకు భిన్నంగా జంక్ ఫుడ్స్, స్వీట్స్, స్పైసీ ఫుడ్స్ వంటివి నిద్రకు ముందు తీసుకుంటే మెదడుపై ప్రతికూల ప్రభావం చూపి, నిద్రలేమికి, నిద్ర వచ్చిన తర్వాత భయంకరమైన లేదా ప్రతికూల కలలను ప్రేరేపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అందుకే నిద్రకు ముందు లేదా మధ్యరాత్రిళ్లు స్నాక్స్‌ను స్కిప్ చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.






