రోజుకో బెల్లం ముక్క తినండీ.. ఏం జరుగుతుందో చూడండి

by Daayi Srishailam |

ఆరోగ్యానికి బెల్లం ముక్క

రోజుకో బెల్లం ముక్క తినండీ.. ఏం జరుగుతుందో చూడండి
X

దిశ, ఫీచర్స్

బెల్లం ఆరోగ్యానికి దోహదకారిగా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు.. మలబద్దకం.. నెలసరి నొప్పులు.. రక్తహీనత వంటి ఎన్నో సమస్యలకు బెల్లం సహాయపడుతుంది. బెల్లంలో కాల్షియం.. మెగ్నీషియం.. పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు బీకాంప్లెక్స్.. విటమిన్ సీ, డీ2, ఇ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని ఇస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గించడంతో పాటు రక్తపోటును కూడా నియత్రణలో పెడుతుంది. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్యలు రావు. ధనియాల పొడితే కలిపి బెల్లాన్ని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో అధిక రక్తస్రావం.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతులతో కలిపి బెల్లాన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా మారి తెల్ల జుట్టు రాదు. నువ్వులతో కలిపి తీసుకుంటే దగ్గు.. జలుబు.. ఫ్లూ సమస్యలు తగ్గిపోతాయి.

Next Story