- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : ఏఐతో చెత్త బుట్టలు కూడా అప్‌డేట్ అయ్యాయిగా.. బెస్ట్ వీడియో.. చూసి తీరాల్సిందే..
ఏఐ సహాయంతో ప్రతి రంగం అప్‌డేట్ అవుతోంది. హోటల్స్‌లో సర్వెంట్ నుంచి ల్యాబ్‌లో ప్రయోగం వరకు.. అన్నింట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోక్యం ఉంటుంది. ఈ క్రమంలోనే డస్ట్ బిన్ కూడా ఏఐ సహాయంతో అప్‌డేట్

దిశ, ఫీచర్స్ : ఏఐ సహాయంతో ప్రతి రంగం అప్‌డేట్ అవుతోంది. హోటల్స్‌లో సర్వెంట్ నుంచి ల్యాబ్‌లో ప్రయోగం వరకు.. అన్నింట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోక్యం ఉంటుంది. ఈ క్రమంలోనే డస్ట్ బిన్ కూడా ఏఐ సహాయంతో అప్‌డేట్ అయింది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేసిన చెత్త బుట్ట.. ఫుడ్, ప్లాస్టిక్, మెటల్.. ఇలా ప్రతి వేస్టేజ్‌ను ప్రత్యేకంగా సేకరించేందుకు కంపార్ట్‌మెంట్లను కలిగి ఉంది. సెన్సార్ ఆధారంగా వ్యర్థం రకాన్ని గుర్తించి సిగ్నల్ ఇస్తుంది. స్కీన్‌పై ప్రదర్శిస్తుంది. రీసైక్లింగ్, ఆర్గానిక్ అంటూ వేరు చేస్తుంది. బిన్ నిండినప్పుడు నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది.
సోలార్ పవర్‌తో పని చేసే ఈ డస్ట్ బిన్స్‌లో కొన్ని మోడల్స్ వ్యర్థాన్ని కుదించే (కాంపాక్ట్) సాంకేతికతను కలిగి ఉండగా.. దీనివల్ల సేకరణ ఖర్చులు, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. వ్యర్థ సేకరణ సమయాన్ని ఆదా చేయడంతోపాటు నగరాల్లో స్వచ్ఛతను పెంచుతుంది. ఈ రకమైన ఇన్నోవేషన్స్ స్మార్ట్ సిటీల భవిష్యత్తును సూచిస్తుండగా.. వాటి అమలులో సాంకేతిక అడ్డంకులు, వినియోగదారుల అవగాహన లాంటి సవాళ్లు ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు.






