వేసవి సెలవుల్లో.. పిల్లలకు ప్రకృతిపై ప్రేమను నేర్పించండి.!

by Daayi Srishailam |

ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలను ప్రకృతికి దగ్గరచేయండి చాలు.

వేసవి సెలవుల్లో.. పిల్లలకు ప్రకృతిపై ప్రేమను నేర్పించండి.!
X

పిల్లలకు ఎండకాలం సెలవులు వచ్చేశాయి.

సెలవుల్లో ఏం నేర్పిస్తారు వాళ్లకు.?

డ్యాన్స్.. క్రికెట్.. స్విమ్మింగ్.. ఇంకేదైనా ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ.

ఇంతే కదా.?

ఇవి ఎప్పుడూ ఉండేవే కదా.?

ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలను ప్రకృతికి దగ్గరచేయండి చాలు.

అది జీవితాన్ని నేర్పిస్తుంది.

జీవితకాలం ఉపయోగపడుతుంది.

- దిశ, ఫీచర్స్

మనం భూమిపైనే నివసిస్తాం. కానీ.. ఆ భూమిపై ప్రేమగా ఉంటామా.? ప్రకృతే మన జీవితానికి జీవం పోస్తుంది. కానీ ఆ ప్రకృతితో మమేకం అవుతున్నామా.? నేటితరం పిల్లలు ప్రకృతి అంటే అదేదో ఇంటర్నెట్‌లో దొరికే వస్తువు అనుకుంటున్నారు. అందుకే ఈ సమ్మర్ హాలిడేస్‌లో వాళ్లకు ప్రకృతికి దగ్గర చేయండి.. ప్రకృతిపై ప్రేమ పెరిగేలా ఎంకరేజ్ చేయండి.

గార్డెనింగ్ కిట్

బొమ్మలు.. గ్యాడ్జెట్స్‌తో కొంత బ్రేక్ ఇప్పించండి. గార్డెనింగ్‌పై దృష్టిపెట్టేలా ప్రోత్సహించండి. మంచి ఫలితాలొచ్చిన తర్వాత తెలుస్తుంది ఇదెంత మంచి ప్రయత్నం అనేది. కుండలు.. విత్తనాలు.. మట్టి వంటి సాధారణ గార్డెనింగ్‌కు వినియోగించే సాధనాలను కొనివ్వండి. Sow and Grow వంటివి ఇది మన బాధ్యత అని అర్థమయ్యేలా Little Gardener’s Kitలను అందిస్తున్నాయి.. ఇప్పించండి.

సొంత చెట్టు

పిల్లలు నాటిని మొక్క పోషణ బాధ్యత వాళ్లే చూసుకోవాలి. దానికొక పేరు పెట్టమనండి. రుతువులు మారేకొద్దీ మొక్క పెరుగుదల ఎలా మారుతుందో పరిశీలించాలి. ప్రతీ సంవత్సరం మొక్క ఎత్తును కొలవాలి. ఇలాంటి యాక్టివిటీస్ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. Grow-Trees.com లేదా SayTrees వంటి సంస్థలలో మీ పిల్లల పేరిట చెట్టును బహుమతిగా ఇవ్వొచ్చు.

టెర్రేరియం కిట్

ఒక జాడీలో మినీ తోటలు చేసేలా ప్రోత్సహించాలి. ఇవి చూడటానికి కూడా సరదాగా ఉంటాయి. సిటీలో.. అపార్ట్‌మెంటుల్లో ఉండేవాళ్లకు కూడా ఇవి బాగుంటాయి. అంతేకాక వాళ్లు ఎకో సిస్టమ్ గురించి నేర్చుకునే అవకాశం ఉంటుంది. myBageecha అనే సరదా DIY టెర్రేరియం కిట్‌ను అందిస్తుంది. సమ్మర్ సరదా ఆటల్లో భాగంగా దీనిని పరిచయం చేస్తే చాలా నేర్చుకుంటారు.

నేచర్ బుక్స్

అబ్బా.. సమ్మర్ హాలిడేస్ లో కూడా బుక్సేనా.? అనే ఫీలింగ్ ఉన్న పిల్లల మైండ్ సెట్ ను కూడా మార్చే శక్తి నేచర్ బుక్స్ కు ఉంది. కాబట్టీ అడవులు.. సముద్రాలు.. గొప్ప జీవుల గురించి కథలు.. పుస్తకాలను పిల్లలకు చదివించే ప్రయత్నం చేయండి. ఇవి మన మూలాలను పరిచయం చేస్తాయి. ప్రకృతిపై ప్రేమను పెంచుతాయ. Amazonలో A Cloud Called Bhura వంటి బుక్స్ ఇప్పించండి.

వర్షపు నీటి సంరక్షణ

ఇది అటు ఆట సరదాను.. ఇటు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పించడానికి వర్షపు నీటిని ఎలా సంరక్షించాలో నేర్పించండి. Butterfly Edufields వంటి వర్షపు సంరక్షణ కిట్స్ ఇప్పించండి. సైన్స్ తెలుస్తుంది. సరదాగానూ ఉంటుంది. 8- 12 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇది చక్కగా సూటవుతుంది. చిన్న ట్యాంకులు.. రూఫ్‌టాప్‌లతో ప్రయోగాలు చేసుకోవచ్చు.

ఫీడర్.. బర్డ్‌హౌజ్

ఈ ఎండల్లో పిల్లల్ని ఎక్కడ పంపిస్తాం.? ఇంట్లోనే ఆడుకోండని చెప్తే వాళ్లేమో బొమ్మలు కావాలి అని అంటారు. అలాంటి వాళ్లకు ఆటలాగే అనిపించే బర్డ్ ఫీడర్ ఇప్పించండి. కిటికీ దగ్గర వీటిని పెట్టి.. పిల్లలకు ఒక జత బైనాక్యులర్స్ ఇవ్వండి. ప్రతి ఉదయం పక్షులను సందర్శించడం ఒక స్వచ్చమైన మాయాజాలంలా అనిపిస్తుంది. Nature Forever Society వాళ్లు మంచి మంచి రంగులతో బర్డ్ హౌజ్‌లను అందిస్తున్నారు.

కంపోస్టింగ్ కిట్

మీ పెరట్లో ఉండే కొద్దిపాటి జాగాలో సేంద్రీయ గార్డెనింగ్ సాగుచేయండి. క్యారెట్లలాంటివి సాగుచేయండి. ఆ పనిలో పిల్లలను భాగస్వాములు చేయండి. ఆహార శేషాలతో కపోస్టింగ్ చేయడం ఎలాగో వారికి నేర్పించండి. Daily Dump వంటివి రంగు రంగుల హోం కంపోస్టర్లను పరిచయం చేయండి. మొదటిసారి ప్రయత్నించేవారికి ఇది సరదా గైడ్‌లా పనిచేస్తుంది.

Next Story