వేసవిలో పొడి దగ్గు వేధిస్తోందా? అయితే కారణం ఇదే!

by Anjali |
వేసవిలో పొడి దగ్గు వేధిస్తోందా?  అయితే కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చలికాలం వచ్చిందంటే కొంత మందిలో జలుబు, దగ్గు రావడం సహజం. అయితే కొంత మందికి కాలంతో సంబంధం లేకుండా కూడా కొన్ని రకాల వ్యాధులు వేధిస్తుంటాయి. అలాగే సమ్మర్‌లో కూడా నిరంతరంగా పొడిదగ్గుతో చాలా ఇబ్బంది పడుతుంటారు. వేసవిలో పొడి దగ్గు రావడానికీ గల కారణాలు, దాని నుంచి బయటపడే మార్గాన్ని ఇప్పుడు చూద్దాం..

వేసవిలో పొడిదగ్గుకు కారణాలు...

* వేసవిలో పొడి దగ్గుకు హేఫీవర్ కారణం ఒకటిగా చెప్పుకోవచ్చు. గాలిలో దుమ్ము, ధూళి, పూల పుప్పొడి, మరెన్నో రీజన్స్ వల్ల గొంతులో చికాకు మొదలై.. దగ్గు వస్తుంది. అలాగే గొంతు వెనక భాగంలో పొడిబారడం వల్ల చికాకు వచ్చి.. దీని వల్ల కూడా దగ్గుకు దారితీస్తుంది.

* ఈ చికాకుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. చికాకు ఎక్కువ రోజులు ఉంటే దగ్గు కూడా ఎక్కువ రోజుల పాటు వేధిస్తోందట.

* ఎండాకాలం వచ్చిందంటే వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. దీనివల్ల తేమ లేని పొడి గాలి వల్ల కాలుష్య కారకాలు ఒక చోటు నుంచి.. అనేక చోట్ల వరకు దూరం వరకు వ్యాపించి.. శ్వాస నాళాలు చికాకు వచ్చి దగ్గు రావడం జరుగుతుంది.

* కొంతమందికి తీపి పదార్థాలు తినడం వల్ల, చల్లని వాతావరణంలో ఉండడం వల్ల, కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల, డస్ట్ వల్ల పలు రకాల కారణాల వల్ల దగ్గుతో బాధపడుతుంటారు.

నివారణ చిట్కాలు...

* పొడిగాలి వల్ల సోకే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికీ ఉత్తమమైన మార్గాల్లో హైడ్రేటెడ్‌గా ఉండటం ఒకటి. ప్రతిరోజూ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో చెమట రూపంలో ఎక్కువ నీరు పోతుంది. ఈ సమస్య నుంచి తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

* మండే ఎండల్లో అందరికీ కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు చల్లని నీటి వల్ల ఉపశమనంగా పొందవచ్చు. చల్లని నీరు ఎక్కువగా తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అందుకని గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతులో చికాకును దూరం చేసుకోవచ్చు.

* దగ్గు ఎక్కువ రోజులు వేధిస్తే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతులో వచ్చిన ఇన్ఫెక్షన్‌ను గుర్తించి సరైన ట్రిట్‌మెంట్ తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

* అలాగే ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ వంటివి ఉపయోగిస్తే బయటి కాలుష్యాన్ని వడపోసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి: ఈ చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండి..!

Next Story