ఈ డ్రింక్స్ మంచిదే కానీ.. మోతాదు మించితేనే రిస్క్..!

by Javid Pasha |

ఈ డ్రింక్స్ మంచిదే కానీ.. మోతాదు మించితేనే రిస్క్..!

ఈ డ్రింక్స్ మంచిదే కానీ.. మోతాదు మించితేనే రిస్క్..!
X

దిశ, ఫీచర్స్ : టీ, కాఫీ, సోడా, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ వంటి పానీయాలు లిమిటెడ్‌గా తాగితే ప్రాబ్లం లేదు. కానీ మోతాదుకు మించితేనే రిస్క్ అంటున్నారు నిపుణులు. అధికమోతాదులో తీసుకోవడం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగడంవల్ల ఏమీ కాకపోవచ్చు కానీ అంతకు మించితే ఈ ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నది. ఇక రోజుకు 3 నుంచి 4 కప్పుల బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగితే మాత్రం ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షిస్తుందని తెలిపింది.

*అధ్యయన వివరాల ప్రకారం.. కాఫీ, సోడా, అధిక చక్కెరలు కలిగిన వివిధ తియ్యటి పానీయాలు, జీరో షుగరింగ్ స్వీటెనర్స్ తరచుగా ఎక్కువ మోతాదులో తీసుకోవడం స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని 22 శాతం పెంచుతాయి. అంతేకాకుండా రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ రిస్క్ పెరుగుతుంది. అయితే ఫిజీ డ్రింక్స్, సోడా మధ్య సంబంధం దక్షిణ అమెరికా, తూర్పు, మధ్య ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కువ చక్కెరలు కలిగిన ప్యాకేజ్డ్ పండ్ల రసాలు తరచుగా తాగితే ‘ఇంట్రాక్రానియల్ హేమరేజ్’ కారణంగా మహిళల్లో స్ట్రోక్ ముప్పు 37 శాతం పెరుగుతుంది.

*రోజుకు 4 కప్పులకంటే ఎక్కువగా కాఫీ తాగితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 37 శాతం పెరుగుతుందని అధ్యయనం వెల్లడించగా.. టీ తాగడంవల్ల మాత్రం 18 నుంచి 20 శాతం ఈ ముప్పు తగ్గుతుందని కూడా చెబుతోంది. ఇక రోజుకు 3 నుంచి 4 కప్పులు గ్రీన్ టీ తాగితే స్ట్రోక్ వచ్చే చాన్సెస్ 27 శాతం తగ్గుతాయి. ముఖ్యంగా పాలు కలిపిన టీ తాగడంవల్ల అందులోని యాటీ ఆక్సిడెంట్ల ప్రభావం కారణంగా స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొన్నది.

Next Story