Filtered Water: ఫిల్టర్‌ వాటర్‌ తాగితే ఆస్పత్రి బెడ్‌పైకే.. ఏకంగా క్యాన్సర్ వస్తుందట.. ఇది చదవండి!

by Vennela |

Does Filtered Water Cause Cancer: ఈరోజు ప్రతిఒక్కరూ ఫిల్టర్ వాటర్(Filtered Water) తాగుతున్నారు.

Filtered Water: ఫిల్టర్‌ వాటర్‌ తాగితే ఆస్పత్రి బెడ్‌పైకే.. ఏకంగా క్యాన్సర్ వస్తుందట.. ఇది చదవండి!
X

దిశ, వెబ్ డెస్క్: Does Filtered Water Cause Cancer: ఈరోజు ప్రతిఒక్కరూ ఫిల్టర్ వాటర్(Filtered Water) తాగుతున్నారు. మీరు కూడా ఫిల్టర్ వాటర్ (Filtered Water)తాగుతున్నట్లయితే బిగ్ అలర్ట్. ఫిల్టర్ వాటర్ ఎక్కువగా తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ (chlorinated water)వల్ల పలు రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని తాజాగా జరిగిన పరిశోధనలో వెల్లడయ్యింది. నీటి ద్వారా శరీరంలోకి చేరే ట్రైహాలోమీథేన్, నైట్రేట్ తో ప్రొస్టేట్ క్యాన్సర్ (cancer)ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వేగంగా వ్యాపించే కణుతులకు ఈ రసాయనాలకు ఎక్కువ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.

సాధారణంగా మనం తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ (chlorinated )అనే రసాయనాన్ని వాడుతారు. దీని వల్ల నీటిలో ఉండే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టిరియాను తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్ (chlorinated water)తో ట్రైహాలోమీథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ముఖ్యంగా క్యాన్సర్(cancer) వచ్చే ముప్పును పెంచుతున్నట్లు వివరించారు. దీని వల్ల మూత్రాశయ క్యాన్సర్(cancer) 33శాతం ముప్పు ఉందని..పెద్దపేగు క్యాన్సర్(cancer) 15శాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా గర్భిణీలకు గర్భస్రావం(Miscarriage), తక్కువ బరువుతో జననం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

తాగునీటిలో సాధారణంగా కనిపించే కాలుష్య కారకాల్లో నైట్రేట్(Nitrate) ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్(Nitrate) అధిక మోతాదులో ఉంటుందని వివరిస్తున్నారు. అది భూగర్భజలాల్లోకి వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని వెల్లడిస్తున్నారు. నిజానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమే అయినా, మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతుందని పేర్కొన్నారు.

దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్(Nitrate), టీహెచ్ఎంల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ (cancer)ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్ స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. దీనికోసం 2008 నుంచి 2013 మధ్య స్పెయిన్ లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 697 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల వివరాలను విశ్లేషించారు. దీనిలో వేగంగా వ్యాపించే కణితులు 97 మందిలో ఉన్నాయని కనిపెట్టారు. 8ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఎంత పరిమాణంలో నైట్రేట్(Nitrate), టీహెచ్ఎంలు తీసుకున్నారనే విషయాన్ని పరిశీలించారు. వారు ఏ ప్రాంతంలో నివసించారు..ఎలాంటి నీరు తాగారు..జీవితకాలంలో ఎంత పరిమాణంలో నీరు తాగారు..అక్కడి భూగర్భ జలాల్లోని రసాయనాల తీరు వంటి వివరాలను పరిశీలించారు.

అయితే ఇందులో నైట్రేట్(Nitrate) పరిమాణం ఎంత పెరిగితే ప్రొస్టేట్ క్యాన్సర్(cancer) ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు రోజుకు సరాసరిన 6 మిల్లీగ్రాముల కంటే తక్కువగా నైట్రేట్(Nitrate) తీసుకునేవారితో పోలిస్తే 14 మిల్లీగ్రాముల కన్నా అధికంగా పొందేవారికి గ్రేడ్ లేదా మీడియం గ్రేడ్ ప్రొస్టేట్ క్యాన్సర్(cancer) వచ్చే ప్రమాదం 1.6రెట్లు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరికి దూకుడుగా వ్యాపించే ప్రొస్టేట్ కణితి వచ్చే ముప్పు 3 రెట్లు ఎక్కువని వెల్లడించారు.

Next Story