Coffee: కాఫీ ఇలా తాగితే మీ పని ఫసక్.. దయచేసి ఈ తప్పు చేయవద్దు!

by Vennela |

Coffee: కాఫీ(Coffee) అంటే చాలా మంది ఇష్టం. ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.

Coffee: కాఫీ ఇలా తాగితే మీ పని ఫసక్.. దయచేసి ఈ తప్పు చేయవద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: Coffee: కాఫీ(Coffee) అంటే చాలా మంది ఇష్టం. ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మీకు కూడా కాఫీ (Coffee)అంటే ఇష్టమైతే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే పేపర్ కప్పులో కాఫీ(Coffee in a paper cup) తాగుతున్నట్లయితే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఓ పరిశోధన ప్రకారం వేడి ద్రవాన్ని ఒక పేపర్ కప్పులో పావుగంట సేపు ఉంచినట్లయితే అది వెయ్యికిపైగా మైక్రో ప్లాస్టిక్ కణాల(Micro plastic particles)ను విడుదల చేస్తుందని తేలింది. ఒక పేపర్ కప్పులో 3 కప్పుల కాఫీ తాగడం వల్ల 75వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు(Micro plastic particles) శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

ప్లాస్టిక్ వస్తువులు(Plastic items) ఈ రోజులు సర్వసాధారణంగా మారాయి. ఎవరి ఇంట్లో చూసినా..మన చుట్టూ ఎక్కువగా వాడేవి ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులే. అది కంటికి కనిపించే ప్లాస్టిక్ మాత్రమే కాదు..కళ్లకు కనిపించని ప్లాస్టిక్ కణాలు కూడా ఎన్నో ఉన్నాయి. మైక్రో ప్లాస్టిక్స్(Micro plastic) మన శరీరంలోకి ఎలా ప్రవేవిస్తాయో నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) పై నిషేధం విధించాయి. అందుకే పేపర్ కప్పులో వేడి వేడి కాఫీ లేదా టీ తాగడం ప్రమాదకరమని రుజువు అయ్యింది.

అయితే ప్లాస్టిక్ కప్పుల కంటే పేపర్ కప్పులు(Paper cups) ఆరోగ్యానికి హాని చేయవనే మాట నిజమే. అయితే అది ఎంత వరకు నిజమనేది తెలియదు. పేపర్ కప్పులో వేడి వేడి కాఫీ లేదా టీ తాగడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పేపర్ కప్పు లోపలి భాగంలో ప్లాస్టిక్ పూత పూస్తుంటారు. దీని వల్ల వేడి పానీయంలోకి విషపూరిత రసాయనాలు కలుపుతారని చెబుతున్నారు నిపుణులు.

ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technology) పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక ప్లాస్టిక్ కప్పులో పావుగంట సేపు వేడి పానీయం ఉంచినట్లయితే 25వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు(25,000 microplastic particles), హానికరమైన అయాన్లు, హెవీ మెటల్ ను ఆ కాఫీలోకి విడుదలవుతాయని అధ్యయనం తెలిపింది. వేడికాఫీ ఉన్న పేపర్ కప్పులో ఫ్లోరైడ్(Fluoride), క్లోరైడ్(Chloride), నైట్రేట్(Nitrate), సల్ఫేట్ వంటి విషపూరిత లోహం వంటి ఆయాన్లను పరిశోధకులు గుర్తించారు. ఐఐటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ గ్లాసులో నీటిని ఉంచడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి పేపర్ కప్పులో కూల్ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.


Next Story