- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Relationship: భార్యాభర్తల మధ్య గొడవలకు దోషాలే కారణమా .. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?
భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు సహజం.

దిశ, వెబ్ డెస్క్ : ఎవరి జీవితంలోనైన ప్రతిదీ వాస్తుతో ముడిపడి ఉంటుందని వాస్తు శాస్త్ర ( vastu shastra ) నిపుణులు చెబుతున్నారు. ఇంటి దిశ, వస్తువులు, ఇతర విషయాలు ఇలా అన్ని వారి సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఉన్న వాళ్ళ నుంచి పేద వాళ్ళ వరకు భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు చాలా సహజం. అయితే, ప్రతి సారి గొడవలు జరుగుతుంటే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, దాని వలన మనిషి సంతోషంగా ఉండలేరు. ఇది, మీ ఇంట్లో వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. భార్యాభర్తల మధ్య వివాదాలు తెచ్చే వాస్తు దోషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రధాన ద్వారం ( Main door )
ఇంటి ప్రధాన ద్వారం తప్పు దిశలో ఉంటే అది భార్య ,భర్తల మధ్య గొడవను పెంచుతుంది. కాబట్టి, ఇది సరైన దిశలో మాత్రమే ఉండేలా చూసుకోండి.
పూజ
శివ-పార్వతులకు పూజిస్తే ప్రతి రోజూ పూజించాలి, మధ్యలో ఆపకూడదు. ఇలా చేయడం వలన శివుడు ఆగ్రహం తెచ్చుకుంటారు. కాబట్టి, మంత్రాలను పఠించడం వలన సంబంధాలను బలంగా ఉంటాయి. అంతేకాదు, ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.
బెడ్ రూమ్ దిశ ( Bed room )
బెడ్ రూమ్ దిశ నైరుతి దిశలో ఉండాలి. లేదంటే అది భార్యాభర్తల మధ్య గొడవలను సృష్టిస్తుంది.
అద్దం పెట్టే ప్లేస్
బెడ్ రూమ్ లో మంచం ముందు అద్దాన్ని అస్సలు ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగి గొడవలు వస్తాయి.
విరిగిన వస్తువులు ( Furniture )
విరిగిన వస్తువులు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి చేరుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు బ్రేక్ అయిన వస్తువులను మారుస్తూ ఉండండి. అలాగే, ఈశాన్య దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






