- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Conjugal Life: ఇష్టాలను వదులుకోవద్దు..!
వివాహ బంధంలో అడుగు పెట్టినప్పుడు దంపతులిద్దరూ కూడా ఎదుటివారే లోకమని భావిస్తుంటారు.

దిశ, ఫీచర్స్: వివాహ బంధంలో అడుగు పెట్టినప్పుడు దంపతులిద్దరూ కూడా ఎదుటివారే లోకమని భావిస్తుంటారు. భాగస్వామి అభిప్రాయమే తన అభిప్రాయం అన్నట్లుగా నడుచుకుంటారు. అయితే, ఎంత భార్యాభర్తలు అయినా సరే ఇద్దరూ ఎప్పుడూ ఒకేలా ఆలోచించరు. ఒకేలా ప్రవర్తించలేరు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అది కుదరకపోతే వేరే మార్గంను ఎంచుకోవాలి. అప్పుడే ఇరువురి మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. జీవితం సంతోషంగా ఉంటుంది.
సంసారంలో దంపతులిద్దరూ ఎదుటి వ్యక్తి మనసును తెలుసుకొని మెలగాలి. భాగస్వామి అభిప్రాయమే తనదని భావించి నడుచుకుంటే.. కొద్ది రోజులకి భాస్వామిపై విసుగు మొదలవుతుంది. అలాగని తమమకంటూ ఉన్న స్వేచ్ఛను మర్చిపోకూడదు. కొందరు పెళ్లైన కొత్తల్లో భాగస్వామి కోసం తమ అలవాట్లను మార్చుకుంటారు. మొదటి నుండి ఇష్టమైన వాటిని తినకపోవడం, కొన్ని విషయాల్లో భాగస్వామికి అనుగుణంగా నడుచుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఇది మానసికంగా వ్యక్తిని పీడిస్తుంది.
పెళ్లంటే అభిప్రాయాలు, ఆలోచనలు ఎదుటివారిపై రుద్దడం కాదు. ఇరువురిలో ఎవ్వరూ తమ వ్యక్తిత్వాలు, అభిరుచులను మార్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ జరిగితే అది ఏ అంశం అయినా సరే దానిపై స్పష్టత ఉండాలి. విషయం పెద్దది కాకుండా సామరస్యంగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. మొత్తం సమయం భాగస్వామికే టేకాయించాలని అనుకుంటే.. కొంత కాలానికి అది బెడిసి కొట్టే చాన్స్ ఉంటుంది. తనకంటూ సమయాన్ని కేటాయించుకోవాలి.
కొందరు భాగస్వామికి సంబంధించిన ప్రతీ చిన్న విషయంలో కలగజేసుకుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. భార్యభర్తలు అయినా సరే కొన్ని విషయాలో ఎవరి పరిధిలో వారు ఉండాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తే ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉంటాయి.
Read More...
Anger: ఎక్కువగా కోపం వస్తోందా.. తగ్గించుకోండిలా..!






