2026లో మీ జీవితం మారిపోవాలా? ఇకపై ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకోవద్దు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-29 03:11:42  IST  )

మరో నెల రోజుల్లో న్యూ ఇయర్(2026) రాబోతుంది.

2026లో మీ జీవితం మారిపోవాలా? ఇకపై ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకోవద్దు!
X

దిశ,వెబ్‌డెస్క్: మరో నెల రోజుల్లో న్యూ ఇయర్(2026) రాబోతుంది. వాస్తవానికి కొత్త సంవత్సరం కోసం చిన్న పెద్ద అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే, కొత్త ఏడాదిలోనైనా తమ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు తొలగిపోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ తరుణంలో తమకు నూతన ఏడాదిలో ఎలా ఉండబోతుందో కూడా ముందుగానే తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు గడిచిన ఏడాది కంటే మంచి జీవితాన్ని కోరుకుంటారు.

అంతేకాదు, కొందరైతే తమకు ఉన్న కొన్ని చెడు అలవాట్లను కూడా ఈ ఏడాది చివరి నెలైన డిసెంబర్‌ ఏ డెడ్ లైన్‌గా పెట్టుకుని నూతన ఏడాదిని నూతనంగా ప్రారంభించాలని తీర్మానాలు కూడా తీసుకుంటారు. ఇలా ఎన్నో ఆశలతో అడుగు పెట్టబోయే నూతన సంవత్సరంలో కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలంటే కొన్ని రకాల వాస్తు దోషాలను పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం.. నూతన ఏడాది ప్రారంభానికి ముందు ఇల్లు, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అందుకే కొత్త సంవత్సరానికి ముందు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తీసేయడం వల్ల మంచి జరుగుతోందంట. అంతేకాదు కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మీ ఇంట్లో పాత వస్తువులు, విరిగిన షూస్, చెప్పులు, ఆగిపోయిన గడియారం ఉన్నట్లైతే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటిని తొలగించాలి. అవి ఇంట్లో ఉన్నట్లైతే పేదరికాన్ని తెస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఇంట్లో విరిగిన వస్తువులు అశుభకరంగా చెబుతుంటారు. మీ ఇంట్లో టేబుల్, సోఫా, కుర్చీ వంటి విరిగి ఉన్నట్లైతే ఇంట్లో నుంచి తీసేయండి. అలాగే, విరిగిన దేవుడి విగ్రహం ఉంటే కొత్త ఏడాది ప్రారంభానికి ముందు పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే అశుభం కలుగుతుంది. కొత్త సంవత్సరంలో కొత్త దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు.

Next Story