Alcohol: ఒకేసారి మందు మానేయోచ్చా.. మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. !

by Phanindra |

అది తాగితే, ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని తెలిసినా అదే పనిగా మద్యం సేవిస్తుంటారు.

Alcohol: ఒకేసారి మందు మానేయోచ్చా.. మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. !
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది మద్యపానం ( Alcohol) ఆరోగ్యానికి హానికరం చెబుతున్నా కూడా చుక్క లేనిదే రోజు గడవదు అన్నట్టు చేస్తున్నారు. అది తాగితే, ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని తెలిసినా అదే పనిగా మద్యం సేవిస్తుంటారు. ఒక్కసారి ఇది అలవాటైతే దాని నుంచి బయట పడటం చాలా కష్టం. రోజూ తాగే వ్యక్తి దీనిని మానెయ్యడానికి ఓ చిన్న యుద్ధమే చేస్తాడు. దాని కోసం, కొత్త మందులు వాడుతాడు .. అయిన కూడా ఉపయోగం ఉండదు.

ఎవరైతే నాలుగు, ఐదు నెలల నెలలకు ఓసారి డ్రింక్ ( Alcohol ) చేస్తారో, వారి శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అయితే, రోజూ మద్యం సేవించే వారు.. ఒకేసారి మానేస్తే ఉన్న ఆరోగ్య సమస్యలతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సడెన్ గా డ్రింక్ మానేయడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఇలా మధ్యలో మానేయడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

సడెన్ గా డ్రింక్ మానేయడం వలన వల్ల కొందరిలో ఒత్తిడి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మద్యం మానేసిన తర్వాత, చెవుల్లో రెండు శబ్దాలు వినిపించడం వంటి జరుగుతుంటాయి. ఈ అలవాటు నుంచి బయటపడినప్పుడు ఎదురయ్యే ఇదొక రకమైన సిండ్రోమ్ అని డాక్టర్స్ చెబుతున్నారు. అందు వలన, మద్యపానం మానేయాలనుకునేవారు క్రమక్రమంగా డోస్ తగ్గిస్తూ దూరం పెట్టాలని సూచిస్తున్నారు. రెండుమూడు నెలలకు ఓసారి.. తాగే వారికీ ఎలాంటి ప్రమాదం ఉండకపోయినా.. ప్రతిరోజూ తాగేవారి పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుందని అన్నారు. మూడు రోజుల్లోనే మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. కొన్నిసార్లు అయితే, తెలియకుండానే కోపం వస్తుంది. చాలా ఏళ్ళ నుంచి డ్రింక్ తాగే వారు అకస్మాత్తుగా మానేస్తే, కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story