- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tongue: హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారో తెలుసా?
నాలుకను చూసి మనకి ఎలాంటి సమస్య ఉందనేది డాక్టర్లు చెబుతారు.

దిశ, వెబ్ డెస్క్ : మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ కి వెళ్తాము. అయితే, అప్పుడు ముందుగా వైద్యులు నాలుకను చూపించమని చెబుతారు. ఇలా పరీక్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదొక డయాగ్నోస్టిక్ పద్ధతి. నాలుకను చూసి మనకి ఎలాంటి సమస్య ఉందనేది డాక్టర్లు చెబుతారు. నాలుక రంగు, ఆకారం, పరిమాణం మన ఆరోగ్య స్థితిని చెబుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉంటే నాలుక పొడిగా మారుతుంది. ఇది ఒంట్లో నీటి కొరతను కూడా తెలియజేస్తుంది. అనీమియా సమస్య ఉంటే నాలుక పాలిపోయి రక్తహీనతను సూచిస్తుంది. ఒకవేళ శరీరంలో ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుకపై తెల్లని పొరలు ఏర్పడతాయి.
విటమిన్ లోపాలు ( Vitamin deficiency)
B12 వంటి వంటి లోపం శరీరంలో కనిపిస్తే నాలుక రంగు, ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, ఆహార అలవాట్ల వలన నాలుక రంగు మారుతుంది. అందుకే, బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది.
ధూమపానం ( Smoking )
ధూమపానం వలన నాలుక రంగు మారుతుంది. అంతే కాదు, ఇది ఉపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. మన దేశంలో చిన్న వయస్సు వారు కూడా స్మోక్ చేస్తున్నారు. ఈ అలవాటు వారి ప్రాణాలను కూడా తీస్తోందని తెలుసుకోవడం లేదు. దీని వలన దంతాల రంగు కూడా మారుతుంది.
ఆరోగ్య సమస్యలు ( Health problems )
థైరాయిడ్ సమస్యలు ఉంటె నాలుక పెద్దదిగా అవుతుంది. అలాగే లివర్, కిడ్నీ సమస్యలు ఉన్న వారికీ నాలుక రంగు మారుతూ ఉంటుంది. నాలుకపై నల్ల మచ్చలు, రక్తం రంగులో గడ్డలు ఉంటే కాన్సర్‌ను సూచిస్తుంది. నాలుక పరీక్ష ఒక త్వరిత, సులభమై డయాగ్నోస్టిక్ సాధనం. అయితే, వ్యాధి నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






