Mercury: పాద‌రసాన్ని చేతితో ముట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

by Phanindra |

పాదరసాన్ని( Mercury) చేతితో ముట్టుకోము.. ఎందుకంటే, ఇదొక విష పదార్ధం.

Mercury: పాద‌రసాన్ని చేతితో ముట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : పాదరసాన్ని( Mercury) చేతితో ముట్టుకోము.. ఎందుకంటే, ఇదొక విష పదార్ధం. దీనిని టచ్ చేయడం అంత మంచిది కాదు. దీన్ని ముట్టుకుంటే అది మన శరీరంపై ప్ర‌భావాన్ని చూపిస్తుంది. అలాగే, దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. పొరపాటున దాని ఆవిరి ఆవిరి కళ్లకు త‌గిలితే మంటలు వస్తాయి. ఆ తర్వాత కంటి చూపు మందగిస్తుంది. దీని వాసన పీల్చడం వలన గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి వంటి సమస్యలు వస్తాయి.

మెర్క్యురీ అనేది న్యూరోటాక్సిన్, ఇది నాడీ వ్యవస్థ, మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. పాద‌ర‌సం ప్ర‌భావం వలన మూత్రపిండాల ( kidney problems ) సమస్యలు వస్తాయి. స్త్రీలు గర్భధారణ సమయంలో పాదరసాన్ని తాకకూడదు. పొరపాటున అది త‌గిలితే పుట్టుకతో వచ్చే లోపాలు, అభివృద్ధి ఆలస్యమవుతుంది.

పాదరసాన్ని తాకిన వారు ఆ ప్రాంతాన్ని సబ్బు శుభ్రం పరచుకోవాలి . మెర్క్యురీ అంటిన‌ దుస్తులను తొలగించండి. పాదరసంతో సంబంధం ఉన్న వస్తువులను తీసివేయండి. వైద్యుని సలహాను పాటించాలి. ఆరోగ్యంలో ఏదైనా కొత్త లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పాదరసాన్ని ముట్టుకోవడం చాలా ప్రమాదకరం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప దానిని నేరుగా పెట్టుకోకూడదు. ఇది బంగారం మీద పడితే అది రంగు మారి దేనికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి, పాద‌రసాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story