- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Facts: దోమలకు ఇష్టమైన బ్లెడ్ గ్రూప్ ఏంటో తెలుసా..?
దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక రోగాలు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమలు కుట్టడం వల్ల వస్తాయి.

దిశ, ఫీచర్స్: దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక రోగాలు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమలు కుట్టడం వల్ల వస్తాయి. అయితే, ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిన కుట్టవు. వాటికి నచ్చిన బ్లెడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. సాధారణంగా మనుషుల రక్తంలో O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్, A నెగిటివ్, AB పాజిటివ్ అండ్ నెగిటివ్, B పాజిటివ్ అండ్ నెగిటివ్ మొత్తం ఎనిమిది రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
వీటన్నింటిలో ఎక్కువగా O పాజిటివ్, నెగిటివ్ వ్యక్తులను మాత్రమే ఎక్కువగా కుడతాయని, అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎంటమాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయం తెలిపింది. O బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు చాలా ఇష్టం. దోమలు శరీరంలో నుంచి వచ్చే వాసన వాటికి రుచిగా అనిపిస్తుంది. ఆ తరువాత A బ్లడ్ గ్రూప్ వాళ్లని కుడతాయి. ఈ రెండు దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్‌లు. వీరిని మాత్రమే ఎక్కువగా కుడుతుంటాయి. మిగితా బ్లడ్ గ్రూప్ వాళ్లని తక్కువగా కుడతాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ దోమల్లో కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు. వాటి గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి. మనిషి రక్తం వాటి గుడ్లకు వెచ్చదనాన్ని ఇస్తుంది. ఒక్కసారి సేకరించిన రక్తంతో.. ఆడ దోమ 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతుంది. ఇక, మగ దోమలు మాత్రం పువ్వుల నుంచి తేనెను, చెట్ల రసానాలను తాగడం చేస్తుంటాయి.






