- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neem Tree: ఈ ఆకు అన్ని రకాల వ్యాధులకు ఔషధమని తెలుసా .. దీన్ని ఎలా తీసుకోవాలంటే..?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.

దిశ, వెబ్ డెస్క్ : వేప చెట్టు ( Neem Tree) మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీని వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ ఆకు సర్వరోగ నివారిణి. ఇది చేదుగా ఉంటుంది కానీ, మంచి ఔషధంలా పని చేస్తుంది. ఉదయాన్నే వేపాకును తినాలంటే కష్టంగా ఉంటుంది.. కానీ, ఇది ఎన్నో రకాల సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది. అయితే, దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..
పరగడుపున వేపాకులు తినడం వలన అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చుని నిపుణులు చెబుతున్నారు. చర్మం మీద అయిన గాయాలను ఈ వేప రసాన్ని రాయడం వలన త్వరగా తగ్గిపోతాయి. ఉదయాన్నే వేప పుల్లలతో పళ్ళను తోమడం వలన చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి. నోటి నుంచి దుర్వాసన రావడాన్ని కూడా అరికడుతుంది. ఈ వేపాకులలో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 50 రకాల జాతులు ఉన్నాయి. అంతేకాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వేపాకును ఔషధంగా ఉపయోగిస్తారు.
మొటిమలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకుల పేస్ట్ ను ముఖం పైన రాసుకుంటే ఇవి తగ్గుతాయి. గజ్జి, తామర లాంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతుంది. ఇంకా చుండ్రుతో బాధ పడేవారు ఈ ఆకులతో, పసుపును కలిపి తలకి పట్టించి 30 నిముషాల తర్వాత తల స్నానం చేస్తే దురదతో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే, అప్పుడప్పుడు శరీరమంతటా మర్దనా చేస్తే ఒత్తిడి నుంచి ఉపసమనం పొందుతారు. ప్రేగు వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఈ వేపాకు రసం ఔషధంలా పనిచేస్తుంది. రోజూ పరగడుపున ఈ ఆకులు తినడం వలన కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






