పింక్ సాల్ట్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

by Yella Dhawani Reddy |

పింక్ సాల్ట్ (Pink salt) లేదా హిమాలయన్ సాల్ట్ అనేది హిమాలయ పర్వతాల

పింక్ సాల్ట్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పింక్ సాల్ట్ (Pink salt) లేదా హిమాలయన్ సాల్ట్ అనేది హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న ఉప్పు గనుల నుంచి తీయబడిన ఒక రకమైన ఉప్పు. ఇది సహజంగా గులాబీ రంగులో ఉంటుంది. ఇక సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్​లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి 80 రకాల మినరల్స్ ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమయంలో పింక్‌ సాల్ట్‌ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఉప్పు శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే పింక్ సాల్ట్​ అయితే బాడీని తేమగా ఉంచుతుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. పింక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, పింక్ సాల్ట్ శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పింక్ సాల్ట్ శరీరంలోని విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పింక్ సాల్ట్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దీనిని టూత్ పౌడర్ లా కూడా వినియోగించవచ్చు. దీని వల్ల చిగుళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే పళ్లు కూడా తెల్లగా మారతాయి. చిగుళ్ల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. పింక్ సాల్ట్‌ను వంటలో సాధారణ ఉప్పులాగే ఉపయోగించవచ్చు. దీనిని స్నానపు నీటిలో లేదా స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు.

అయితే, పింక్ సాల్ట్‌ను కూడా మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. పింక్ సాల్ట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Next Story