కొబ్బరినూనెని ముఖానికి రాయడం వలన ఎన్ని లాభాలో తెలుసా

by Disha Web Desk 10 |
కొబ్బరినూనెని ముఖానికి రాయడం వలన ఎన్ని లాభాలో తెలుసా
X

దిశ, ఫీచర్స్: కొబ్బరి నూనెలో ఎన్నో అద్భుతమైన గుణాలున్నాయి. అంతే కాకుండా, కొబ్బరి నూనె అనేక సౌందర్య ప్రయోజనాలను కలిగి ఉంది. కొబ్బరి నూనెతో ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. దీని వల్ల చర్మానికి చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

యవ్వనంగా..

కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది అలాగే మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. కొబ్బరి నూనెతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల కాలుష్యం నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.

చర్మ సమస్యలు..

ఆడవాళ్ళలో కొందరికి మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు కొబ్బరి నూనెను రాసుకుంటే, ఈ నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపు, ఎరుపును తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మొటిమలతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


Next Story

Most Viewed