Sea ​​Animal: కడుపులో " పళ్లు "ఉండే సముద్రపు జంతువు గురించి తెలుసా.. కొన్ని చోట్ల ప్రజలకు ఇదే ఆహారం?

by Phanindra |

చూడని సముద్రపు జంతులు చాలానే ఉన్నాయి

Sea ​​Animal:  కడుపులో  పళ్లు ఉండే సముద్రపు జంతువు గురించి తెలుసా.. కొన్ని చోట్ల ప్రజలకు ఇదే ఆహారం?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ భూమిపై అనేక రకాల జీవ రాశులు జీవిస్తున్నాయి. వాటిలో కొన్ని అంతరించి పోగా .. మరి కొన్ని వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. మనం రోజూ చూసే వాటి కన్నా .. చూడని సముద్రపు జంతులు చాలానే ఉన్నాయి. ఇవి మనకీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ వరల్డ్ లో రూ. 4వేల కంటే ఎక్కువ జాతుల (ఎండ్రకాయ) పీతలున్నాయని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. వీటిలో కొన్ని భూమిపైనా ఉంటే, మరి కొన్ని నీటిలో ఉన్నాయి.

చాలా చోట్ల వీటిని ఆహారంగా తీసుకుంటారు. పీతలను ( Crabs )ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మళ్లీ తింటూనే ఉంటారు. దీని రుచి అలా ఉంటుంది మరి! వీటికి సంబంధించిన ఒక వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అయితే, సాధారణంగా అన్నీ జంతువులకు పళ్లు నోటిలో ఉంటాయి. కానీ, పీతలకు కడుపులో ఉంటాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలీదు. ఇవి ఏవి దొరికితే అవి తినేస్తాయి. ఎండ్రకాయలు 45 ఏళ్ల వరకు జీవించగలవు. వీటిని మనం తీసుకోవడం వలన మన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. జైలులో ఖైదీలకు పీతలను ఆహారంగా ఇస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story