Creativity : రొటీన్ ఆలోచనల్లో కూరుకుపోయారా?.. క్రియేటివిటీని పెంచే మార్గాలివే..

by Dishafeatures2 |
Creativity : రొటీన్ ఆలోచనల్లో కూరుకుపోయారా?.. క్రియేటివిటీని పెంచే మార్గాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ క్రియేటివిటీ ప్రదర్శించలేకపోతే కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే సృజనాత్మక మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇదేదో కొందరికి మాత్రమే ఉండే అద్భుతమైన లేదా రహస్యమైన జ్ఞానం ఏమీ కాదు. ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మక సామర్థ్యం ఉంటుంది. కాకపోతే దానిని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. క్రియేటివిటీ కండరం లాంటిదని, యూజ్ చేసుకునే తీరును బట్టి బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వర్క్ అండ్ రిలేషన్‌షిప్స్‌తో పాటు జీవితంలో అన్ని రంగాలకు, అన్ని సందర్భాలకు వర్తించే గ్రేట్ మెథడ్‌గా క్రియేటివిటీ అంటున్నారు. అయితే దానిని మరింత పదును పెట్టాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు.

కొత్తగా ట్రై చేయండి

క్రియేటివిటీ పెరగాలంటే రొటీన్‌కు భిన్నంగా కొత్తగా ప్రయత్నించాలని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు వ్యాయామంలో భాగంగా వాకింగ్ చేయడానికి బదులు సైకిల్ తొక్కడం మైండ్ రీఫ్రెష్ అవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే మరికొన్నిసార్లు మీరు చేసే పని గొప్పగా ఉండాలనుకుని, ఏదో చేయాలని మరేదో చేస్తుంటారు. కొందరు అసలు విషయాలను మర్చిపోవడంవల్ల క్రియేటివిటీని ప్రదర్శించలేకపోతారు. ఇలాంటివారు తమ ఐడియాలను ఒక నోట్‌బుక్‌లో లేదా డైరీలో రాసుకోవడం చేస్తుంటే క్రియేటివ్ అవుట్‌లెట్‌ను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది.

ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి

మీరు కొన్ని సందర్భాల్లో ఏమీ తోచకుండా ఉంటారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేయండి. ఇలా చేయడంవల్ల సృజనాత్మక ఆలోచనలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ చిన్ననాటి స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడితే, అతనివల్ల మీలో ఉత్సాహం రెట్టింపు కావడమే కాకుండా గొప్ప ఐడియాలు కూడా పొందవచ్చు. చాలామంది తమకు ఇష్టమైన స్నేహితులతో మాట్లాడినప్పుడు హ్యాపీగా ఫీలవుతారు. ఆ సందర్భంలో సంతోషానికి కారణం అయ్యే ఎండార్ఫిన్స్, డొపమైన్ వంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి క్రియేటివిటీని ప్రోత్సహించడంలోనూ దోహదపడతాయి.

మ్యూజిక్ వినండి

సంగీతం సరదాకోసం మాత్రమే కాదు, ఇది మోటార్ యాక్షన్స్, ఎమోషన్స్ అండ్ క్రియేటివిటీకి బాధ్యత వహించే మెదడు ప్రాంతాలను ప్రేరేపిస్తుందని పరిశోధనల్లో తేలింది. కొందరు క్లాసికల్ మ్యూజిక్ సృజనాత్మకతను పెంచుతుందని చెప్తుంటారు. అదొక్కటే కాదు, మ్యూజిక్ ఏదైనా మీకు ఇష్టమైనది అయి ఉండి, రిలాక్స్‌గా, సంతోషంగా భావిస్తున్నారంటే మీలో తప్పకుండా క్రియేటివిటీని పెంచుతుందని అర్థం చేసుకోవచ్చు.

సెకండ్ ఓపీనియన్ తీసుకోండి

కొన్నిసార్లు ఒకే అంశంలో అనేక అనుమానాలతో ఇబ్బంది పడుతుండవచ్చు. దీనివల్ల మీలోని సృజనాత్మక శక్తి మందగించి ఉండవచ్చు. ఇక్కడ సెకండ్ ఓపీనియన్ కూడా తీసుకుంటే మీ అభిప్రాయాన్ని, మానసిక దృక్పథాన్ని రీఫ్రెష్ చేయవచ్చు. అందుకే ప్రతిదీ మీరే చేయాలని, మీరే ఆలోచించాలని అనుకోకండి. ఫ్రెండ్స్ లేదా ఇతరులు కూడా దానిపై ఏం అనుకుంటున్నారో అడగండి. దీంతోపాటు ధ్యానం చేయడం, మీకు దూరంలో ఉన్న ప్రదేశాన్ని లేదా అక్కడ గడిపిన సమయాన్ని ఊహించుకోవడం కూడా మీలో ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది.

చేతిరాత, హావభావాలు

‘ది క్రియేటివ్ క్యూర్’ రైటర్స్ అయిన క్వారీ అండ్ ఆల్టన్ బారన్ ప్రకారం కంప్యూటర్‌ను ఉపయోగించడంకంటే చేతితో రాయడం క్రియేటివిటీని ప్రేరేపిస్తుంది. కాబట్టి ముఖ్యమైన విషయాలను ఒక నోట్‌బుక్‌లో రాయడం ప్రాక్టీస్ చేయండి. సంభాషణల సందర్భంగా చేతులతో సంజ్ఞలు లేదా హావ భావాల ప్రదర్శన కూడా క్రియేటివిటీకి నిదర్శనంగా ఉంటాయి. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు నిపుణులు. మీరు ఒక స్టోరీ చెప్తున్నప్పుడు, ఇంకేదైనా వివరిస్తున్నప్పుడు అందుకు తగినట్లుగా చేతులు కదిలించడం మీలో క్రియేటివిటీని మరింత ప్రేరేపిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

నిద్ర, నవ్వు, వ్యాయామం

ఒక స్టడీ ప్రకారం మీ కళ్లను ముందుకు, వెనుకకు కదిలించడం అనేది మెదడులోని ఎడమ, కుడి వైపుల మధ్య ఇంటరాక్షన్‌ ప్రాసెస్‌ను పెంచుతుంది. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుంది. కొన్నిసార్లు అనగ్రామ్స్‌ సాల్వ్ చేయడంలో నిలబడి ఉండేకంటే, పడుకొని ఉండటంవల్ల మెరుగ్గా ఉంటారని పరిశోధనలో తేలింది. అందుకే అవసరం అయినప్పుడు క్షితిజ సమాంతరంగా(Horizontal)కాసేపు స్పెండ్ చేయండి. అలాగే నవ్వడం, వ్యాయామం చేయడం, ప్రకృతిలో గడపం, నాణ్యమైన నిద్ర వంటివి కూడా మెరుగైన మానసిక స్థితికి దోహదం చేస్తాయి. క్రియేటివిటీని పెంచుతాయి.


Next Story

Most Viewed